Stress And Anxiety :
Stress And Anxiety : తోటపని మీ మనస్సు మరియు శరీరంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనిపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. కమ్యూనిటీ గార్డెనింగ్ కోసం అవసరమైన నిధులను సమకూర్చింది. గార్డెనింగ్ ప్రారంభమైన తరువాత దానిలో రోజువారిగా వివిధ రకాల తోటపనులు చేసేవారిలో ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలు గణనీయంగా తగ్గడాన్ని వారు గమనించారు.
లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనలు ప్రకారం కమ్యూనిటీ గార్డెనింగ్ క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు మరియు మానసిక ఆరోగ్య రుగ్మతలను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని చిన్న పరిశీలనా అధ్యయనాలు తోటపని చేసే వ్యక్తులు ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినడంతో పాటుగా, ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉంటారని కనుగొన్నారు. అయితే ఈ పరిశోధనలో ఆరోగ్యకరమైన వ్యక్తులు కేవలం తోటపనిపై మొగ్గు చూపుతున్నారా లేదా తోటపని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా అనేది అస్పష్టంగా ఉంది.
వాస్తవానికి తోటపని చేయడం మీ మానసిక ఆరోగ్యంపై అనేక ప్రభావాలను చూపుతుంది. పచ్చని చెట్లు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. చుట్టూ ఉన్న ప్రకృతితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనసు సమాజంతో మరింత ఆనందంగా మెలిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవుట్‌డోర్ గార్డెనింగ్, మొక్కల సంరక్షణ ప్రజలకు సూర్యరశ్మి తగిలేలా చేసి అధిక మొత్తంలో విటమిన్ డి, సెరోటోనిన్ సింథసైజర్ లభించేలా చేస్తుంది. సెరోటోనిన్ అనేది మెదడులో ఆనందాన్ని కలిగించే ఒక రసాయనం.
మొక్కలతో నిండిన ఇళ్లు మరియు ప్రాంతాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలాగే దృష్టిని పెంచుతాయి. ప్రకృతిలో గడిపిన తర్వాత మొత్తం మానసిక స్థితి బాగా మెరుగుపడుతుంది. తోటపని అనేది అటు చేతులను ఇటు మనస్సును బిజీగా ఉంచడానికి తోడ్పడుతుంది. గార్డెనింగ్ వంటి హ్యాండ్-ఆన్ కార్యకలాపాలు మెదడు మరొక పనిపై దృష్టి పెట్టేలా చేస్తాయి. ఆకుపచ్చ ప్రదేశాలకు ప్రాప్యత పెరగడం వల్ల పెద్దవారిలో మానసిక క్షోభ, నిరాశ లక్షణాలు, క్లినికల్ ఆందోళన మరియు మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి”