కోవిడ్-19 వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్స్ వేగవంతం సురక్షితమేనా?

  • Publish Date - July 11, 2020 / 03:22 PM IST

కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది పరిశోధకులు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. జనవరి నుంచే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. జనవరి 10న చైనాలోని సైంటిస్టులు కరోనా వైరస్ పూర్తి జన్యు సంకేతానికి సంబంధించి సమాచారాన్ని ప్రకటించారు.

కరోనా వ్యాక్సిన్ జన్యపరమైన సంక్రమణను నిరోధించే వ్యాక్సిన్ కోసం అప్పటినుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. చైనాలోని వుహాన్ లో ఉద్భవించిన ఈ వైరస్ ప్రపంచమంతటా విస్తృతంగా వ్యాపించింది. ఈ వైరస్‌కు SARS-CoV-2 అని కూడా పిలుస్తారు. అప్పటినుంచి కరోనా వ్యాక్సిన్, చికిత్స కోసం పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 6 నెలలు తర్వాత కూడా కరోనాను నిరోధించే అసలైన వ్యాక్సిన్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.

వ్యాక్సిన్ రేసులో సురక్షితమైన టీకా వచ్చేనా? :
కోవిడ్-19 కారణమయ్యే వైరస్ పై పోరాడాలంటే రెండు డ్రగ్స్ కలిపి చికిత్స చేస్తేనే ఫలితం ఉంటుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అందులో యాంటీ వైరల్ డ్రగ్ remdesivir తక్కువ వ్యవధిలోనే వైరస్ ప్రభావం నుంచి కోలుకునేలా చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇక స్టెరాయిడ్ అని పిలిచే dexamethasone డ్రగ్ ద్వారా కూడా కరోనా మరణాలను తగ్గించగలదని, కోవిడ్-19తో ఆస్పత్రిలో చేరి తీవ్ర శ్వాసపరమైన సమస్య ఉన్నవారిని ప్రాణపాయం నుంచి తప్పించినట్టు పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చేశాయి.

కానీ, ఇప్పటివరకూ వ్యాక్సిన్ రేసులో సురక్షతమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇప్పటికే దాదాపు 180 మందిపై కొన్ని వ్యాక్సిన్ ట్రయల్స్‌ నిర్వహించగా.. జంతువులు, మనుషులపై కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరిలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి యూఎస్. ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది.

భద్రత, వ్యయంతో వ్యాక్సిన్ తయారీ వేగం పెరిగి తప్పుదోవ పట్టే అవకాశం లేకపోలేదని కొంతమంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మహమ్మారిని అంతం చేయడానికి అవసరమైన హెర్డ్ రోగనిరోధక శక్తి, వ్యాక్సిన్ పొందటానికి తగినంత మందిని ఒప్పించే ప్రయత్నాలను నిరోధించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సాంప్రదాయకంగా, టీకాలు బలహీనమైన లేదా చంపేసిన వైరస్‌లు లేదా వైరస్ శకలాలు నుంచి తయారవుతాయి. కానీ పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి సంవత్సరాలు పట్టవచ్చునని అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి టీకాలు తప్పనిసరిగా కణాలలో రూపొందించాలి.

క్లినికల్ ట్రయల్స్‌లో స్పీడ్ రికార్డులు :
శరీరంలోని కణాలపై కనిపించే పై కొన భాగాన్ని స్పైక్ ప్రోటీన్ అంటారు. ఇది వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. స్పైక్ ప్రోటీన్ వైరస్ వెలుపల ఉన్నందున, యాంటీబాడీలను గుర్తించడం కూడా సులభమైనదిగా పరిశోధకులు అంటున్నారు. స్పైక్ ప్రోటీన్‌ను RNA లేదా DNAగా తయారుచేసే SARS-CoV-2 వెర్షన్ కాపీ చేసారు.

వ్యాక్సిన్ శరీరంలోకి పంపిన తర్వాత రోగనిరోధక వ్యవస్థ వైరస్ గుర్తించి కణాలలోకి రాకుండా నిరోధించే యాంటీబాడీస్ విడుదల చేస్తుంది. వ్యాప్తిని నివారించడం లేదా తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించగలదు. ఈ విధానాన్ని ఉపయోగించి ఔషధ తయారీదారులు టీకాలు, క్లినికల్ ట్రయల్స్ విషయంలో స్పీడ్ రికార్డులు సృష్టించారు.

మిల్కెన్ ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌లో భాగమైన ఫాస్టర్‌కూర్స్ 179 మందిని వ్యాక్సిన్ ట్రాక్ చేస్తోంది. వీటిలో ఎక్కువ భాగం ఇప్పటికీ ల్యాబ్, జంతువులలో పరీక్షించారు. దాదాపు 20 మందిపై ఇప్పటికే పరీక్షలు ప్రారంభించారు.ఇప్పుడు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు ఉన్నాయి. మోడెనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, బెథెస్డా, ఎండి., వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి 30,000 మంది వాలంటీర్లను టీకా లేదా ప్లేసిబోతో టీకాలు వేస్తోంది.

మోడెర్నా టీకాకు రెండు మోతాదులు అవసరం. ఏ వ్యక్తికైనా టీకాలు వేయడానికి 28 రోజులు పడుతుందని NIIID డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు. కొంతమంది పరిశోధకులు వివాదాస్పద ఛాలెంజ్ ట్రయల్స్‌ను ప్రయత్నించడం ద్వారా క్లినికల్ ట్రయల్స్‌ను మరింత వేగవంతం చేయాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్య అధికారులు కూడా దుష్ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తారు. వ్యాక్సిన్ ట్రయల్స్ దుష్ప్రభావాలు లేవని ఖచ్చితంగా చెప్పలేమని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు