Second variant two cases in UK : అసలే 2020 మహమ్మారి కాలం.. ప్రాణాంకతమైన వైరస్ జాతులు పుట్టుకొస్తున్నాయి. కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి కొత్త స్ట్రెయిన్ వైరస్ విజృంభిస్తుంటే.. దీనికి తోడు మరో కొత్త వేరియంట్ డేంజరస్ వైరస్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ వైరస్.. యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్ జాతికి చాలా భిన్నమైనదిగా పరిశోధకులు కనుగొన్నారు. ఈ రెండు వైరస్‌లు అత్యంత వేగంగా వ్యాప్తిచేయగలవని హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో కేసుల పెరుగుదలకు కారణమని అనుమానిస్తున్న కరోనావైరస్ అత్యంత సంబంధిత కొత్త వేరియంట్ యూకేలో బయటపడిందని వైద్య కార్యదర్శి మాట్ హాంకాక్ చెప్పారు. 501.V2 అనే వేరియంట్ చిన్నవారిలో ఎక్కువగా వ్యాపిస్తుందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేరియంట్ వైరస్.. అధిక వైరల్ లోడ్ కలిగి ఉందని చెబుతున్నారు. ఫలితంగా ఒక వ్యక్తి నుండి వ్యక్తికి మరింత సులభంగా వ్యాపించగలదని హెచ్చరిస్తున్నారు. రెండు వైరస్లు విడిగా అభివృద్ధి చెందాయని, దక్షిణాఫ్రికాలో ఇటీవలి అంటువ్యాధుల పెరుగుదలకు ఈ కొత్త వేరియంట్ కారణమని భావిస్తున్నారు.
కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికా నుంచి యూకేకు వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరిలో కొత్త వేరియంట్ వైరస్ కేసులను గుర్తించారు. ఒక కేసు లండన్‌లో, రెండోది వాయువ్యంలో నమోదైంది. యూకేలో కనుగొన్న కొత్త వేరియంట్ కంటే ఎక్కువ పరివర్తన చెందినట్లు కనిపిస్తుందని హాంకాక్ చెబుతున్నారు. లండన్, ఆగ్నేయం తూర్పున కరోనావైరస్ కేసులు భారీగా పెరిగినట్టు ఆయన తెలిపారు. కొత్త వేరియంట్ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని హాంకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్ ఉన్నవారిని కలిసి వారిని కూడా క్వారంటైన్ కు తరలించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై తక్షణ ఆంక్షలు విధించారు.
బ్రిటీష్, ఐరిష్ జాతీయులు, వీసాదారులు, శాశ్వత నివాసితులు దేశంలోకి రావొచ్చు. కానీ, వారి ఇంటితో పాటు 10 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండవలసి ఉంటుంది. అదనంగా, గత 15 రోజులుగా దక్షిణాఫ్రికాలో ఉన్న ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు తప్పక క్వారంటైన్ లోకి వెళ్లాలని చెప్పారు. యుకెకు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ట్రావెల్ కారిడార్ లేదు. ఇటీవల దేశం నుండి తిరిగి వచ్చిన ఎవరైనా ఇప్పటికే 10 రోజులు పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనాతో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం వెనుక దక్షిణాఫ్రికా జాతి వైరస్ ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారించిన 28 రోజుల్లో 744 మంది మరణించినట్లు యూకే ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.