coronavirus in Restaurants: కొత్త అధ్యయనం ప్రకారం restaurantలకెళ్లి తినేవాళ్లు వెళ్లనవాళ్లకన్నా రెండింతలు కరోనా బారినపడ్డారు. The Morbidity and Mortality Weekly Reportను US Centers for Disease Control and Prevention (CDC)బైటపెట్టింది. 18 ఏళ్ల మించిన వాళ్లపైన అధ్యయనం చేశారు. వీళ్లందరూ కోవిడ్ బాధితులే. వీళ్ళలో ఎక్కువమంది చెప్పింది ఒక్కటే…మేం రెస్టారెంట్లకెళ్లాం.
కరోనారాని వాళ్లను అడిగారు. వాళ్లలో చాలా తక్కువమంది మాత్రమే రెస్టారెంట్లకెళ్లాం….అక్కడే తిన్నాం అనిచెప్పారు.
రెస్టారెంట్లకెళ్లి తిన్నవాళ్లలో రెండింతల మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అదే హోటల్స్ జోలికెళ్లనవాళ్లలో ఎక్కువమందికి నెగిటీవ్ వచ్చింది.
కరోనా కంట్రోల్ అయ్యింది. అన్నింటిని ఆన్ లాక్ చేద్దామనుకొనే దేశాలకు ఇది
మంచి పాఠమని అంటోంది సిడిసి రిపోర్ట్.
https://10tv.in/vitamin-d-and-c-supplements-and-that-they-can-lessen-your-corona-or-covid-infection-says-dr-fauci/
రెస్టారెంట్లకెళ్తే కరోనా వస్తుందా?
అందరికీ వస్తుందని కాదు. కాకపోతే భోజనం చేస్తున్నప్పుడు మాస్క్ వేసుకొని తినలేంకదా. దానికితోడు తింటున్నప్పుడు గట్టిగా మాట్లాడతాం… నవ్వుతాం… టచ్ చేసుకొంటాం. దానికితోడు గాలి అక్కడిక్కడే
తిరుగుతుంది.
గాలిలో వైరస్ ఉంటుందని మనకు ముందుగానే తెలుసు. గట్టిగా మాట్లాడేవాళ్ల నుంచి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనీ రిపోర్ట్స్ తేల్చేశాయి. ventilation, గాలి వచ్చే డైరెక్షన్,
airflow అన్ని కలసి virus transmission ప్రభావితం చేస్తాయి. మీరు ఎంతగా social distancing పాటించినా, mask వేసుకున్న సమస్య తప్పదు.
ఏప్రిల్‌లో Guangzhou restaurantలో పాజిటీవ్ వ్యక్తి నుంచి వచ్చిన వైరస్ 9మందికి సంక్రమించింది. కారణం ఆ రెస్టారెంట్ ఏసీ. అతని నోటి వెంట వచ్చిన తుంపర్లు అక్కడంతా వ్యాపించి కరోనా వ్యాప్తికి కారణం. దీనర్ధం ఒక్కటే, రెస్టారెంట్లకెళ్లడం రిస్క్.