Eat Radish
Eat Radish : ముల్లంగి సంవత్సరం పొడవునా దొరికే వెజిటేబుల్ . చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ముల్లంగిలో విటమిన్లు ఎ, బి, సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ముల్లంగి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా పోషకాలతో నిండి ఉంది. ఏదో ఒక రూపంలో ముల్లంగి నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముల్లంగిని పచ్చిగా తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు. ఈ ముల్లంగిని తీసుకునేటప్పుడు కొన్ని ఫుడ్ ఐటెమ్స్, డ్రింక్స్ తీసుకోవటం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. ముల్లంగి తీసుకొనక ముందు, తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. ముల్లంగితో కలిపి నారింజని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా తీసుకోవటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కడుపు సమస్యలు తలెత్తుతాయి.
2. దోసకాయ, ముల్లంగి కలిపి తింటే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దోసకాయలో ఆస్కార్బేట్ ఉంటుంది. ఇది విటమిన్ సిని పీల్చుకునేలా చేస్తుంది. ఈ కారణంగానే దోసకాయ, ముల్లంగిని కలిపి తినొద్దు.
3. ముల్లంగి తిన్న వెంటనే, తినడానికి ముందు టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మలబద్దకం పెరిగి ఆమ్లత్వానికి కారణమవుతుంది.
4. ముల్లంగితో కలిపి కాకరకాయను తీసుకోవటం మంచిది కాదు. ఆరోగ్యానికి ప్రమాదకరం. వాస్తవానికి, ఈ రెండింటిలో కనిపించే సహజ మూలకాలు ఒకదానితో ఒకటి కలవటం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వల్ల శ్వాస సమస్యల్ని కలిగించడమే కాకుండా, గుండెకి ప్రాణాంతకగా మారుతుంది.
5. ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం మంచిది కాదు. సాధారణంగా మల్లంగి శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది పాలతో కలిస్తే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి కడుపునొప్పి వస్తుంది. కాబట్టి ముల్లంగి తిన్న తర్వాత రెండు గంటల తర్వాత పాలు తీసుకోవడం మంచిది.
6. ఎక్కువగా ముల్లంగిని తిన్నప్పుడు, అది మీ బాడీలో అధిక మూత్ర సమస్యకి, డీహైడ్రేషన్‌కి కారణమవుతుంది. బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది. ఎవరైనా లోబీపి ఉంటే వారు ముల్లంగి తినకపోవడమే మంచిది.