Drowsy Driving : డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది నిద్రపోవడానికి కారణాలు తెలుసా ? దీనిని నివారించాలంటే..

వాహనం నడిపే సందర్భంలో నిద్రపోవటం వల్ల సురక్షితంగా డ్రైవ్ చేసే మీ సామర్థ్యంపై ప్రభావం ఉంటుంది. మగత కారణంగా రహదారిపై శ్రద్ధ పెట్టే సామర్థ్యం తగ్గుతుంది. అకస్మాత్తుగా బ్రేక్ వేయటం , స్టీరింగ్ కంట్రోల్ చేయవలసి వస్తే ప్రతిచర్య సమయాన్ని నెమ్మదిస్తుంది. డ్రైవింగ్ టెక్నిక్స్ అనుసరించటంలో మీ సామర్థ్యాన్ని నిద్ర ప్రభావితం చేస్తుంది.

drowsy driving

Drowsy Driving : డ్రైవింగ్‌ చేసే సమయంలో నిద్రపోవడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నిద్ర లేమి, నిద్ర రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు అలసట కారణంగా కునుకులు తీస్తుంటారు. దీనివల్ల ఘోరమైన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదకరమైన క్రాష్‌లు జరిగే ప్రమాదం ఉంటుంది. మైక్రోస్లీప్‌లు కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటాయి. తగినంత నిద్రపోనప్పుడు ఇలాంటివి జరుగుతాయి.

READ ALSO : Lack Of Magnesium : శరీరంలో మెగ్నీషియం లోపిస్తే నిద్రలేమి సమస్య ఎదురవుతుందా?

చికిత్స చేయలేనటువంటి నిద్ర రుగ్మతలు, అదనపు పనిగంటల కారణంగా డైవింగ్ చేసే సమయంలో చాలా మంది మగతగా కునుకులు తీస్తుంటారు. అదే క్రమంలో కొందరు కొన్ని దీర్ఘకాలిక చికిత్సలకు మందులు వాడేవారైతే అలాంటి వారు డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో కునుకులు తీసే పరిస్ధితు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర ఎప్పుడు వస్తుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. వాహనం నడిపే సమయంలో నిద్రపోవడం అన్నది ప్రమాదకరం.

వాహనం నడిపే సందర్భంలో నిద్రపోవటం వల్ల సురక్షితంగా డ్రైవ్ చేసే మీ సామర్థ్యంపై ప్రభావం ఉంటుంది. మగత కారణంగా రహదారిపై శ్రద్ధ పెట్టే సామర్థ్యం తగ్గుతుంది. అకస్మాత్తుగా బ్రేక్ వేయటం , స్టీరింగ్ కంట్రోల్ చేయవలసి వస్తే ప్రతిచర్య సమయాన్ని నెమ్మదిస్తుంది. డ్రైవింగ్ టెక్నిక్స్ అనుసరించటంలో మీ సామర్థ్యాన్ని నిద్ర ప్రభావితం చేస్తుంది. సాధారణంగా రహదారులపై వాహన ప్రమాదాలు అర్ధరాత్రి సమయంలో, ఉదయం 6గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం భోజనం తరువాత అధికంగా ఉంటాయి.

READ ALSO : Sleep Problems : నిద్రలేమి సమస్యలతో మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుందా?

రహదారిపై సుదీర్ఘ ప్రయానం చేసే డ్రైవర్లు, తగినంత నిద్ర లేని డ్రైవర్లు, వాణిజ్య ట్రక్కు డ్రైవర్లు, నైట్ షిఫ్ట్ లేదా లాంగ్ షిఫ్టులలో పనిచేసే డ్రైవర్లు, స్లీప్ అప్నియా వంటి చికిత్స చేయని స్లీప్ డిజార్డర్స్ ఉన్న డ్రైవర్లు, నిద్రపోయే మందులు వాడే డ్రైవర్ల విషయంలో డ్రైవింగ్ చేసే సమయంలో నిద్రపోవటానికి అవకాశాలు ఉంటాయి.

వాహనం నడపబోయే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ;

వాహనాలు నడిపేవారు తగినంత నిద్ర పొవాలి. పెద్దలకు రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. అలాగే టీనేజ్‌లకు కనీసం 8 గంటలు అవసరం. రోజువారి షెడ్యూల్ ప్రకారం నిద్ర పోవటం మంచిది.

READ ALSO : Cardamom Milk : గుండె ఆరోగ్యానికి, నిద్రలేమి సమస్యకు రోజుకు ఒక్క గ్లాసు యాలకుల పాలు చాలు!

నిద్ర రుగ్మతలు, పగటిపూట గురక, నిద్రపోవటం వంటి రుగ్మతలు, లక్షణాలు ఉంటే, వైద్యుల వద్దకు వెళ్లి తగిని చికిత్స తీసుకోవాలి. మీరు తీసుకునే మందులపై లేబుల్‌ని తనిఖీ చేయటంతోపాటు ఫార్మసిస్ట్‌ ద్వారా వాటిగురించి తెలుసుకోవాలి. మగతగా ఉండే మందులు తీసుకునేవారు డ్రైవింగ్ కు ఉపక్రమించకపోవటం శ్రేయస్కరం.

డ్రైవ్ చేసే ముందు మద్యం సేవించడం మానుకోవాలి. మద్యం తాగటం అన్నది డ్రైవింగ్‌ చేసేసమయంలో నైపుణ్యాలను దెబ్బతీస్తుంది. మగతను పెంచుతుంది.