Prevent Acne : మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా ? అవి రాకుండా ఉండాలంటే ఏంచేయాలి?

మొటిమలు మనం తీసుకొనే ఆహారంతో తొలగిపోతాయి. అందువల్ల చర్మ సంబంధ సమస్యలు, మొటిమలు తగ్గించడానికి మనం తీసుకునే మార్పులు చేయటం మంచిది. మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను ఇబ్బంది పెడతాయి.

Do you know why acne occurs? What should be done to avoid them?

Prevent Acne : చర్మంపై మొటిమలు ఏర్పడటానికి శరీరంలోని హార్మోన్లు మార్పులకు గురికావడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా యువతలో మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఇతర సాధారణ చర్మ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులతోపాటుగా , చర్మంలో నూనె గ్రంథుల పనితీరు, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి.

మొటిమలు మనం తీసుకొనే ఆహారంతో తొలగిపోతాయి. అందువల్ల చర్మ సంబంధ సమస్యలు, మొటిమలు తగ్గించడానికి మనం తీసుకునే మార్పులు చేయటం మంచిది. మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను  ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాకుండా మానసికంగానూ వేధిస్తాయి.

మొటిమలు రాకుండా ఉండాలంటే ;

1. అయిల్ పదార్ధాలు తినే వారికి అధికంగా మొటిమల సమస్య ఉంటుంది. జిడ్డు చర్మాన్ని కలిగి ఉంటే నూనె, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. మొటిమలను గిల్లడం వంటివి చేయరాదు.

2. ముఖాన్ని సబ్బుతో రోజులో రెండు నుండి మూడు సార్లు కడుక్కోవాలి. ఇంట్లో తరుచూ దొరికే పండ్లుతోటి, వెజిటేబుల్స్ తోటి చర్మానికి స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

3. చర్మానికి ఉపయోగించే మాస్క్‌లు, ఫేషియల్స్, స్క్రబ్బింగ్లు, సౌందర్య సాధనాలు మీ చర్మ తత్వానికి సరిపోయే విధంగా ఉన్నాయో లేదో తెలుసుకొని వాడుకోవటం మంచిది.

4. మొటిమల సమస్య ఉన్నవారు ఎక్కువగా నీరు తాగితే మంచిది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటాక్సీన్స్ చెడు చెమట, మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడి శరీరం తేలికగా, సున్నితంగా తయారవుతుంది.

5. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు. స్వీట్స్, కూల్‌డ్రింక్స్ తగ్గించాలి.

6. ఫ్యాట్, నూనె పదార్థాలు, మసాలాలను వారంలో ఒకరోజుకే పరిమితం చేయాలి. సున్నిపిండితో ముఖం కడుక్కోవడం, క్రీమ్‌ల వాడకం తగ్గించడం, సరైన నిద్ర పోవటం వంటి జాగ్రత్తలు పాటించాలి.

7. అనవసరమైన క్రీములు రాయకూడదు. వీటి వల్ల చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.

8. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి అవకాశం ఉంటుంది. రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డు లేకుండా చూసుకోవచ్చు.

9. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ వ్యాయామం ఉపకరిస్తుంది.