Soy Sauce : ఫుడ్ రుచికరంగా ఉండాలని సోయాసాస్ ను అధిక మోతాదులో వాడుతున్నారా! పునరుత్పత్తి అవయవాలపై ప్రభావం చూపటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు!

సోయా సాస్ ను మోతాదుకు మించి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సోయా సాస్ లో గోధుమలు, గ్లూటెన్ ఉంటాయి. ఒకవేళ మీకు గోధుమల వల్ల అలెర్జీ , ఉదరకుహర వ్యాధి ఉంటే దీన్ని అస్సలు తినకపోవటమే మంచిది. మార్కెట్ లో దొరికే సోయా సాస్ లల్లో ఎక్కువ మొత్తంలో ఫైటేట్ ఉంటుంది. ఇది శరీరంలో ఖనిజాల శోషణను నిరోధిస్తుంది

Do you use high doses of soy sauce to make food tasty! Affecting the reproductive organs and many health problems!

Soy Sauce : సాంప్రదాయకంగా సోయాబీన్స్ మరియు గోధుమలను పులియబెట్టడం ద్వారా ఉత్పత్తి అయ్యేదే సోయా సాస్. సంప్రదాయ సోయా సాస్సోయాబీన్‌లను నీటిలో నానబెట్టి, వేయించి, గోధుమలను చూర్ణం చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దానిలో కొన్ని కలర్స్ ను కూడా కలుపుతారు.ఇది చైనీస్ వంటకాలలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీనిని ‘ఉసుకుచి’ అని పిలుస్తారు. దీనివల్ల ఫుడ్ కు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.

1 టేబుల్ స్పూన్ అనగా15 మి.లీ సోయాసాస్ లో ,కేలరీలు 8 గ్రాములు, పిండి పదార్థాలు 1 గ్రాములు, కొవ్వు 0 గ్రాములు, ప్రోటీన్ 1 గ్రాము, సోడియం 902 mg ఉంటాయి. ఈ పులియబెట్టిన సాస్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరం యొక్క సరైన పనితీరుకు అవసరమైన పోషక పదార్ధమే అయినప్పటికీ అధిక సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, ముఖ్యంగా ఉప్పు-సెన్సిటివ్ వ్యక్తులలో. ఇది గుండె జబ్బులు మరియు కడుపు క్యాన్సర్ వంటి ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

సోయా సాస్ ను మోతాదుకు మించి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సోయా సాస్ లో గోధుమలు, గ్లూటెన్ ఉంటాయి. ఒకవేళ మీకు గోధుమల వల్ల అలెర్జీ , ఉదరకుహర వ్యాధి ఉంటే దీన్ని అస్సలు తినకపోవటమే మంచిది. మార్కెట్ లో దొరికే సోయా సాస్ లల్లో ఎక్కువ మొత్తంలో ఫైటేట్ ఉంటుంది. ఇది శరీరంలో ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. సోయాసాస్ ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో క్లోరోప్రొపనాల్ అనే విష పదార్థాల సమూహం ఉత్పత్తి అవుతుంది. 3-MCPD అని పిలువబడే ఒక రకం రసాయనికంగా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుందని, సంతానోత్పత్తిని తగ్గిస్తుంది మరియు కణితులను కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది.

సోయా సాస్ మరింత టేస్టీగా అవడానికి దీనిలో MSG ని కూడా కలుపుతారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే జీవక్రియ రుగ్మతలు, పునరుత్పత్తి అవయవాలపై హానికరమైన ప్రభావాలు పడతాయి. అలాగే వికారం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక వేళ దీనిని తీసుకోవాలనుకుంటే టీ స్పూన్ కంటే ఎక్కువ అస్సలు తీసుకోరాదు.