red meat
Red Meat : రెడ్ మీట్‌లోని అధిక సంతృప్త కొవ్వు స్థాయిలు గుండె జబ్బులకు దారితీస్తాయి. అందుకే గుండె రక్తనాళాల్లో పూడికల ముప్పు ఏర్పడకుండా ఉండాలంటే మాంసం ఎక్కువగా తినొద్దని వైద్యులు సూచిస్తుండటం అందరికి తెలిసిందే. ఎక్కువగా మాంసం తీసుకోనేవారిలో గుండె మరియు ప్రసరణ సమస్యలు, అకాల మరణం ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
జామా ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధనలో, ప్రాసెస్ చేయబడిన మాంసం, ప్రాసెస్ చేయని ఎర్ర మాంసం లేదా పౌల్ట్రీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ మరియు గుండె మరియు రక్త ప్రసరణ వ్యాధులకు సంబంధించిన మరణం వంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. వారానికి రెండు సార్లు ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల గుండె మరియు రక్తప్రసరణ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 7 శాతం ఎక్కువగా ఉంటుందని వారు కనుగొన్నారు.
రెడ్ మీట్‌లో గొడ్డు మాంసం, గొర్రె మాంసం, పంది మాంసం, దూడ మాంసం వంటివన్నీ ఎర్రమాంసం జాబితా కిందికే వస్తాయి. రెడ్ మీట్‌లో అధిక కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వు పదార్ధం గుండెజబ్బులకు ప్రధాన కారణం. మాంసంలో ఎల్‌కార్నిటైన్ రసాయనం, కోలిన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని పేగుల్లోని సూక్ష్మక్రిములు జీర్ణం చేసుకుంటాయి. రక్తంలో ట్త్రైమిథైలమైన్ ఎన్ ఆక్సైడ్ యొక్క అధిక స్థాయిలు ధమనులు గట్టిపడేలా చేసి గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
అందుకే ఎర్రటి మాంసాన్ని మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో తీసుకోవటం ద్వారా శరీరంలో కొవ్వులు పెరగకుండా చూసుకోవచ్చు. తద్వారా గుండె జబ్బులు వంటివి దరిచేరవు.