Egg white that removes blackheads and makes the face beautiful!
Removes Blackheads : గుడ్డు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఈ పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. అందే విధంగా గుడ్డు లో ఉండే తెల్లసొన అతివల అందాన్ని పెంచటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించి బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. అలాగే ముఖంపై ఉన్న వెంట్రుకలను సహజసిద్ధంగా తొలగించుకోవటంతోపాటు చర్మాన్ని శుభ్రం చేసుకని మృధువుగా తీర్చిదిద్దుకోవచ్చు.
గుడ్డు సొనతో బ్లాక్ హెడ్స్ తొలగిచేందుకు ;
ముందుగా ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. అందులో టిష్యూపేపర్ ముక్కలను ముంచి వాటిని పక్కన పెట్టాలి. కొద్ది సేపటి తరువాత బ్రష్ తో తెల్లసొననను బాగా కలిపి ముఖ్యానికి అప్లై చేయాలి. తరువాత గుడ్డుసొనలో ముంచిన కాగితం ముక్కలను ముఖంపై పరుచుకోవాలి. ఆరిన తరువాత నిధానంగా టిష్యూపేపర్ ను తొలగించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చర్మం బిగుతుగా మారాలంటే గుడ్డు సొనతో ;
ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన , రెండు టీ స్పూన్ల నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వ్ల ముఖంపై ఉండే రంధ్రాల పరిమాణం తగ్గిపోయి చర్మం బిగుతుగా మారుతుంది.