చలికాలం అహ్లాదకరమైన వాతావరణాన్ని అస్వాధిస్తున్నారా? జాగ్రత్తలు ముఖ్యమే!

శరీరం చలికి పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడుతుంది. ముఖ్యంగా కాళ్లపాదాల పగుళ్లు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారు రాత్రి సమయంలో కొబ్బరినూనెను వేడి చేసి దానికి ఒక స్పూను పసుపును కలిపి రాయాలి. అరికాళ్లలో మర్ధన చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.

winter weather

మంచు దుప్పటిలా పరుచుకునే చలికాలానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అదే క్రమంలో అనేక వైరస్ లు మనల్ని చుట్టుముట్టి వ్యాధులను కలిగిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యాధులకు ఈ కాలమే అనువైనది. అనారోగ్య సమస్యలతో చాలా మంది సతమతమవుతుంటారు.

చలికాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ;

1. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ లకు వెళ్లే వారు తప్పనిసరిగా చలిగాలి తగలకుండా చర్మాన్ని కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ధరించాలి. వాహనాలు నడిపే సమయంలో చేతులకు గ్లవుజులు,కాళ్లకు సాక్స్ లు వంటివి వేసుకోవాలి. వీటి వల్ల చలిభారి నుండి రక్షించుకోవచ్చు.

2. చలికాలంలో శరీరం బద్దకిస్తుంటుంది. ఏపని చేయాలని పించదు. ముఖ్యంగా ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు ముసుగు కప్పుకుని పడుకొనే ఉండకుండా ఎండకు కాసేపు అటు ఇటు తిరుగుతుండాలి. ఈ విధంగా చేయటం వల్ల శరీరం కొంత యాక్టివ్ గా మారే అవకాశం ఉంటుంది.

3. చలికాలంలో చాలా మంది నీరు తాగరు. దాహం వేయక పోవటం వల్ల , నీరు పెద్దగా తీసుకోరు అలాంటి వారు గోరు వెచ్చని నీటిని తీసుకోవటం మంచిది. ఇలా చేయటం వల్ల గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుండా జీర్ణ శక్తి పెరుగుతుంది. చల్లగా ఉందని నీళ్లు తక్కువగా తీసుకోవాలనుకోవటం మంచిది కాదు. వీలైనన్ని ఎక్కవ నీరు తాగటం వల్ల అరుగుదల బాగా ఉంటుంది.

4. చలికాలంలో తీసుకునే ఆహార పదార్ధాలను చల్లగా కంటే వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. తాజా ఆహారపదార్ధాలను మాత్రమే తీసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలు పండ్లు, అన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

5. శరీరం చలికి పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడుతుంది. ముఖ్యంగా కాళ్లపాదాల పగుళ్లు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారు రాత్రి సమయంలో కొబ్బరినూనెను వేడి చేసి దానికి ఒక స్పూను పసుపును కలిపి రాయాలి. అరికాళ్లలో మర్ధన చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. స్నానం చేసే సమయంలో ఒక స్పూను తేనె, రెండు చుక్కల గులాబీ వాటర్ కలిపి స్నానం చేయటం వల్ల చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది.

6. చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. దీనికిగాను మాయిశ్చరైజర్లు వాడాలి. ముఖానికి, చేతులకు మీగడ రాసుకుని స్నానంచేయాలి. సబ్బుకన్నా సున్నిపిండి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసుకుని స్నానంచేయాలి. రాత్రి పడుకునేముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకుని పడుకోవాలి.

7. చలికాలంలో ఎండ చురుక్కు మంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అది వేడితో మరింత ఇబ్బందిపడుతుంది. జుట్టు పొడిబారడం, చిట్లటం, చుండ్రువంటివి రాకుండా జాగ్రత్తపడాలి. హెయిర్‌ డ్రైయ్యర్‌ వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది.

8. చలికి పెదవులు తొందరగా చిట్లిపోవడం, పొడిబారడం జరుగుతుంది. తేమగా ఉండటానికి కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి. పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.