Experts say proper treatment for feet is necessary in winter!
Take Care of Your Feet : చలికాలంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ల్లో ఇది కూడా ఒకటి. చర్మం మరియు శరీర సంరక్షణ గురించి ఆలోచించినంతగా పాదాల సంరక్షణమై దృష్టిపెట్టరు. చలికాలంలో పాదాలకు రక్షణ విషయంలో జాగ్రత్తలు పాటించటం అన్నది తప్పనిసరి. ముఖ్యంగా మధుమేహులు, పాదాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదు.
చలికాలంలో చాలా మంది పొడి మరియు పగిలిన పాదాల సమస్యలను ఎదుర్కొంటారు. పడిపోయిన ఉష్ణోగ్రతలే ఈ పరిస్ధితికి కారణం. పాదాలు మందంగా మారతాయి. రక్తస్రావం మరియు పగుళ్లు ఏర్పడతాయి. బూట్లతో నడుస్తున్నప్పుడు పెరిగిన ఒత్తిడి కారణంగా పాదాల దిగువ భాగంలో పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసందర్భాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
చలి కాలంలో పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ;
చలికాలం అంతా మీ పాదాలను శుభ్రంగా, పొడిగా మరియు తేమగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పాదాల రక్షణకోసం మంచి మాశ్చురైజర్లను వాడుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కొని పొడి తువాలుతో తుడిచి కొబ్బరి నూనె రాయాలి. కొద్దిసేపు పాదాలను మునివేళ్లతో నొక్కుతూ ఉంటే రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. చర్మానికి మాయిశ్చరైజ్ చేయడానికి ముందు, మీ పాదాలను హాట్ వాటర్ లో 10 నిముషాలు ముంచి ఉంచాలి.
వేసవికాలం, చలికాలం అనికాకుండా అన్ని సీజన్స్ లో ఎంత ఎక్కువగా నీరు త్రాగితే అంత మంచిది. చర్మం మరియు పాదాలు ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటాయి. అంతే కాదు అంతర్గత అవయవాలు కూడా చాలా మేలు చేస్తుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీరు త్రాగాలి. చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే అందుకు మందంగా ఉన్న షూలను ధరించాలి.మీరు బూట్లు ధరిస్తే కూడా ఏం అవ్వదు. మీకు సౌకర్యవంతంగా ఉన్నవి ధరించవచ్చు.
పాదాల రక్షణ కోసం పెడిక్యూర్ ;
అందమైన పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, హైడ్రోజన్‌పెరాకె్సైడ్ లేదా డెటాల్, షాంపూ వేయాలి. అందులో 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి ప్యూమిక్‌స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ ఉపయోగించి రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి.