Beet Root For Skin : చర్మ సౌందర్యానికి బీట్ రూట్ తో ఫేస్ ప్యాక్ !

బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి మొటిమలతో పాటు వాటి వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. ఒక టీస్పూను పెరుగులో, రెండు చెంచాల బీట్‌రూట్ జ్యూస్ కలిపి మచ్చలున్న చోట ఆ మిశ్రమం రాయాలి.

Face pack with beet root for skin beauty!

Beet Root For Skin : పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించడమే కాకుండా సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు అందించడంలో బీట్‌రూట్‌ ఉపయోగపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా నిర్జీవంగా మారిన చర్మం తిరిగి జీవకళను సంతరించుకొంటుంది. బీట్‌రూట్‌లో ఇనుపధాతువు, విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి తగిన పోషణ
అందిస్తాయి.

సౌందర్య సాధనంగా కూడా బీట్ రూట్ ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి, జింక్‌ పింపుల్స్, వాటి మచ్చలను తొలగించడానికి చాలా సమర్థంగా పనిచేస్తాయి. రక్తంలోని టాక్సిన్లన్నీ బయటకు పంపటం ద్వారా లోపలి నుంచి చర్మం ఆరోగ్యంగా తయారయ్యేలా చేస్తుంది. అలాగే చర్మానికి తగినంత తేమనిస్తుంది. చర్మం పొడిగా మారకుండా సంరక్షిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి.

బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి మొటిమలతో పాటు వాటి వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. ఒక టీస్పూను పెరుగులో, రెండు చెంచాల బీట్‌రూట్ జ్యూస్ కలిపి మచ్చలున్న చోట ఆ మిశ్రమం రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత కడిగేస్తే ఆ మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. తరచూ చేయడం వల్ల క్రమంగా మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయి.

బీట్‌రూట్ రసంలో కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమంతో పెదవులపై మృదువుగా మర్దన చేసుకుంటే పెదవులు మృధువుగా మారతాయి. పెదవులు పొడిగా, పగిలిపోవటాన్ని నివారించుకోవచ్చు. బీట్‌రూట్ జ్యూస్‌లో దూదిని ముంచి దానితో కనురెప్పలతో పాటు కళ్ల చుట్టూ అద్దుకొని కొంత సమయం అయిన తర్వాత కడిగేస్తే కంటి కింది నల్లని వలయాలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.