Protects Skin In Winter : చలికాలంలో వాతావరణ మార్పుల నుండి చర్మాన్ని రక్షించే పండ్లు!

వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లుకు గురవుతుంది. ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది.

Protects Skin In Winter : చలి కాలంలో చల్లని గాలులకు ముఖం కాంతిని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. చర్మంలో తేమను నిలుపుకోవడం కష్టమవుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం చర్మంపై పడుతుంది. వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లుకు గురవుతుంది. ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది. చలికాలంలో చర్మం కళకళలాడేలా చేసుకునేందుకు అనేక రకాల పద్దతులను అనుసరించాల్సి వస్తుంది. అలాంటి పద్దతుల్లో పండ్లు బాగా తోడ్పడతాయి.

చలికాలంలో చర్మానికి రక్షణగా పండ్లు ;

1. నారింజ తొక్కల పొడి ; ఒక స్పూను చొప్పున నారింజ తొక్కల పొడి, ఓట్స్‌ను తీసుకొని దానికి చెంచా తేనె, తగినంత నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ముఖానికి బాగా పట్టించి, అయిదు నిమిషాలు మృదువుగా రుద్ది, గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది. ఓట్స్‌ మృతకణాలను పోగొడతాయి. నారింజ చర్మాన్ని కాంతిమంతం మారుస్తుంది. అలాగే, తేనె చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది.

2. అరటిపండు గుజ్జు ; బాగా పండిన అరటి పండు సగం ముక్కను మెత్తగా చేయండి. దానికి చక్కెర, తేనె కలిపి ముఖానికి అయిదు నిమిషాలు మృధువుగా చల్లటి నీటితో కడుక్కోవాలి. అరటిలో ఎక్కువగా దొరికే విటమిన్‌ ఎ చర్మాన్ని మృదువుగా చేయటంతోపాటు శరీరంపై మచ్చలను తొలగిస్తుంది. దీనిలోని పోషకాలు కొల్లాజెన్‌ ఉత్పత్తికి సాయపడటమే కాదు వృద్ధాప్య ఛాయల్నీ దరిచేరనివ్వవు.

3. బొప్పాయి గుజ్జు ; బొప్పాయిని చిన్న చిన్నముక్కలుగా కోసి మెత్తగా చేసుకోవాలి. దానికి స్పూను పెరుగు, అయిదు చుక్కల నిమ్మరసం కలిపి అయిదు నిమిషాలు ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. పెరుగు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. బొప్పాయి చర్మంలో తేమనిస్తుంది. ట్యాన్‌నీ తొలగిస్తుంది. చర్మాన్నీ మృదువుగా మారుస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు