Dog Angrily
Dog Angrily: మనుషుల్లానే జంతువులు కూడా ఎమోషన్స్ చూపిస్తుంటాయి. పరిశీలిస్తే ప్రతి విషయానికి రియాక్ట్ అవుతూ బాడీ లాంగ్వేజ్ తో ఏదో ఒక తేడా చూపిస్తూ ఉంటాయి. అలాగే తాజాగా ఓ కుక్కకు కోపం వచ్చి రోజూ తినే గిన్నెను ఎత్తేసి నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
అందులో ఏముందంటే.. ఆకలేస్తుందని ఎంతసేపు అరిచినా యజమాని పట్టించుకోవడం లేదు. చిర్రెత్తుకొచ్చిన శునకం తినే గిన్నెను నోటితో కరచుకుని విసిరి కొట్టేసింది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్‌ఎస్) ప్రవీణ్ అంగుసామి పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు.
ఆకలి అవుతుందని కుక్క అరుస్తూ ఉంది. కొద్దిసేపటికి కోపం తెచ్చుకుని వెంటనే గదిలోకి వెళ్లి తాను తినే గిన్నెను నోటితో పట్టుకొచ్చి ఎత్తేసింది. ‘0.5 సెకండ్ల తర్వాత నాకు ఆకలి అవుతుంది’ అని దానికి సంబంధించిన వీడియోను ప్రవీణ్ పంచుకున్నారు. నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియోను చూసి నవ్వేసుకుంటున్నారు నెటిజన్లు. కామెంట్లు అదే రేంజ్‌లో వస్తున్నాయి.
0.5 micro seconds after I get hungry pic.twitter.com/K4je9iBI0u
— Praveen Angusamy, IFS ? (@PraveenIFShere) April 5, 2021