Glycerin : చలికాలంలో మీ ముఖ చర్మ కాంతిని పెంచే గ్లిజరిన్!

ఒక గుడ్డు తెల్లసొనను గిన్నెలో వేసి చెంచా చొప్పున తేనె, గ్లిజరిన్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు పోతాయి.

Glycerin to make your skin glow in winter!

Glycerin : చలికాలంలో చల్లిని గాలుల కారణంగా చర్మం కాంతిని కోల్పోతుంది. పొడిగా మారుతుంది. ఇలాంటి సందర్భంలో చర్మాన్ని కాంతి వంతం చేసేందుకు గ్లిజరిన్ బాగా ఉపకరిస్తుంది. ముఖంపై ఉన్న జిడ్డును తొలగించి ముఖాన్ని శుభ్రపరుచుకునేందుకు గ్లిజరిన్ ను ఉపయోగించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గ్లిజరిన్ చలికాలంలో చర్మానికి సహజ మార్చురైజర్ గా పనిచేస్తుందన్నమాట. ముఖ సౌందర్యం కోసం గ్లిజరిన్ ను చలికాలంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

గ్లిజరిన్ తో ముఖ చర్మానికి ;

అరకప్పు నీటిలో చెంచాన్నర గ్లిజరిన్‌, మూడు చెంచాల మొక్కజొన్న పిండి కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించి చల్లార్చాలి. ఈ పేస్టును ముఖానికి రాసి తడీపొడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ముఖచర్మంపై మురికి పోతుంది. చర్మం శుభ్రపడుతుంది. మొటిమలు, వంటివి రాకుండా చూసుకోవచ్చు. గ్లిజరిన్‌లో ముంచిన దూది ఉండను తీసుకుని ముఖాన్ని మృదువుగా తుడవాలి. కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇలా చేయటం వల్ల గ్లిజరిన్ మాయిశ్చరైజర్‌గా పనిచేయడమే కాకుండా చర్మాన్ని చలికాలంలో తేమగా ఉంచటంలోనూ సహాయపడుతుంది.

పావుకప్పు గ్లిజరిన్‌కు కప్పున్నర గులాబీ నీటిని కలిపి ముఖాన్ని కడిగితే మంచి టోనర్‌గా మారుతుంది. పెట్రోలియం జెల్లీ, గ్లిజరిన్‌, విటమిన్‌ ఈ ఆయిల్‌ సమపాళ్లలో కలిపి స్నానానికి ముందు ముఖానికి అప్లై చేసి పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ముఖచర్మం పాడవ్వకుండా మృదువుగానూ, కాంతివంతంగానూ మారుతుంది. బయటికెళ్లొచ్చిన తర్వాత ముఖంపై పేరుకొన్న దుమ్ము, ధూళిని దూరం చేయడానికి, అలాగే మేకప్‌ను శుభ్రపరచడానికీ ఇది ఉపయోగపడుతుంది.

వృద్ధాప్య ఛాయలు, ముడతలు, గీతలను గ్లిజరిన్‌తో తగ్గించుకోవచ్చు. ఒక గుడ్డు తెల్లసొనను గిన్నెలో వేసి చెంచా చొప్పున తేనె, గ్లిజరిన్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖంపై గీతలను దూరమై వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. గ్లిజరిన్‌ను ఫేస్ వాష్ గా కూడా ఉపయోగించవచ్చు. ఒక కాటన్ బాల్‌పై గ్లిజరిన్ తీసుకొని దానిని ఫేస్ వాష్ గా మీ ముఖంపై అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత మీ ముఖం కడుక్కోండి, మీ చర్మం శుభ్రపడుతుంది.