ఈ మధ్య డాక్టర్లు రోజూ వ్యాయామం చేయాలని సూచిస్తుండటంతో ప్రతిఒక్కరు మొక్కుబడిగా బిజీ రోడ్లపై ఓ అరగంట నడిచేస్తున్నారు. అయితే తాజా అథ్యయనం ప్రకారం దీనిపై ఓ విషయాన్ని స్పష్టమైంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై వాకింగ్, జాగింగ్ చేస్తే కాలుష్య ప్రభావంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని దక్షిణ కొరియా నిపుణులు చేపట్టిన అథ్యయనం స్పష్టం చేసింది.
నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే వీధుల్లో వాకింగ్ చేసేవారిలో హెయిర్ ఫాలింగ్, హెయిర్ కు అవసరమైన ప్రొటీన్ల స్ధాయి తగ్గినట్టు ఈ అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఇక దీనివల్ల ఆస్త్మా, క్రానిక్ బ్రాంకైటీస్, గుండె జబ్బులు, స్ట్రోక్, డిమెన్షియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ కాలుష్య నిపుణులు ప్రొఫెసర్ ఇయాన్ కాల్బెక్ విశ్లేషించారు.
అందుకే వాహన రాకపోకలతో బిజీగా ఉండే రోడ్లపై వాకింగ్, వ్యాయామం చేసి ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే ఇంటి పరిసరాల్లో వ్యాయామం చేయడం సరైనదని వారు పేర్కొన్నారు. ఇక కాలుష్య స్ధాయిలు అధికంగా ఉన్న సమయంలో నివాస ప్రాంగణాలు, ఇంటి సమీపంలోని పార్క్‌ల్లో వ్యాయామం చేయడం మేలని నిపుణులు పేర్కొన్నారు.