Beauty Home Remedies : ముఖ సౌందర్యం కోసం షాపుల్లో దొరికే క్రీములకన్నా, ఇంటి చిట్కాలే బెటర్!

తాజా టమోటా రసం, చక్కెర మీ ముఖాన్ని తెల్లగా చేయుటలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. టమోటా, చక్కెర బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని సమర్థవంతంగా తేలికపరుస్తాయి. కాబట్టి ఈ పదార్థాలతో మీ చర్మం మరింత మెరిసిపోతుంది.

Beauty Home Remedies :

Beauty Home Remedies : ముఖ సౌందర్యం కోసం అందరూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. ముడతలు పడడం, నల్ల మచ్చలు, రంధ్రాలు, జిడ్డు ముఖం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. షాపుల్లో దొరికే క్రీములు, మాయిశ్చరైజర్లు వాడి చాలామంది తమ ముఖాన్ని పాడుచేసుకుంటారు. ఆ తర్వాత మొటిమలు రావడం, ముఖం లో నిగారింపు తగ్గుతుంది. ఇంటి చిట్కాలు ముఖం మెరవడానికి బెటర్​ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ సౌందర్యాన్ని పెంపొందించే కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

శెనగపిండి, నిమ్మరసంతో: మూడు స్పూన్ల శనగపిండి, నిమ్మరసం తీసుకుని మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయుట వలన మెరిసే ముఖం మన సొంతం అవుతుంది.

పాలు, పసుపుతో : పాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. ఈ పాలను ఫ్రిజ్ లో ఉంచాలి. నానబెట్టిన దూది పింజలను రోజూ ఒకటి తీసుకుని కమిలిపోయిన చర్మంపైన రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం, తులసి ఆకులతో : నిమ్మరసం, తులసి ఆకుల రసాన్ని సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇవి చర్మానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

బాదం, పాలతో : నానబెట్టిన బాదం పలుకులను పచ్చిపాలలో కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజు గంట సేపు ఉంచుకోవాలి. రాత్రి పూట ముఖానికి అప్లై చేసి పడుకుంటే మంచిది. ముఖం యొక్క కాంతిని పెంచుతుంది.

టమోటా, చక్కరతో : తాజా టమోటా రసం, చక్కెర మీ ముఖాన్ని తెల్లగా చేయుటలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. టమోటా, చక్కెర బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని సమర్థవంతంగా తేలికపరుస్తాయి. కాబట్టి ఈ పదార్థాలతో మీ చర్మం మరింత మెరిసిపోతుంది.

కలబంద, నిమ్మరసంతో : కలబంద గుజ్జును కొద్దిపాటి నిమ్మరసాన్ని తీసుకొని పేస్టులా చేసుకుని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. జిడ్డు, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి.

బొప్పాయి, తేనెతో : బొప్పాయి సహజమైన సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. బొప్పాయి పేస్టు తీసుకుని ఇందులో తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీని వలన ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.