Home tips to remove bacteria and viruses that cause throat problems in winter!
Throat Problems In Winter : చలికాలంలో గాలిలోని బ్యాక్టీరియా, వైరల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా సైనస్ సమస్యలు ఎదురవుతాయి. చలికాలం వచ్చిందంటే చాలు శ్వాసకోస సమస్యలైన జలుబు, గొంతునొప్పి వంటి ఇబ్బంది కలిగిస్తాయి. చలికాలంలో గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు ఎంతగానో ఉపయోగపడాతాయి. మన ఇంటి వంట గదిలో లభించే వాటితో ఈ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.
సాధారణంగా చల్లటి గాలిలో ఉండే బాక్టీరియా సైనస్ ఛాంబర్‌లోకి ప్రవేశించి, శ్లేష్మ పొరలను ఉబ్బి వాపుకు కారణమవుతుంది. దీని కారణంగా, ముక్కులో శోషరసం ఎక్కువగా స్రవిస్తుంది. గొంతు ద్వారా శ్లేష్మ ద్రవం స్రవిస్తుంది. కొన్నిసార్లు శ్లేష్మం మందంగా మారుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగి గొంతులో నొప్పి వస్తుంది. ఫలితంగా, నిరంతర దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, దవడ నొప్పి, తలనొప్పి, ముక్కు దిబ్బడ మరియు తరచుగా తుమ్ములు వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఎంతగానో తోడ్పడతాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ గానీ లేక దాల్చిన చెక్క తీసుకుని 250మిల్లీ లీటర్ల నీటిలో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. గోరు వెచ్చగా కాగానే దానికి కొంచెం తేనే, నిమ్మరసం కలుపుకుని తాగాలి.
2. ఒక గ్లాసు నీటిని 5 నిమిషాలు వేడి చేసి అందులో ఒక చెంచా ఉప్పు మరియు పసుపు వేసి 3-4 సార్లు పుక్కిలించాలి. నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేయటం ద్వారా గొంతు సమస్యలు తొలగిపోతాయి.
3. ఒక టేబులు స్పూన్ మెంతులు తీసుకుని, 250మిల్లీ లీటర్ల నీళ్ళలో ఉడికించాలి. ఆ తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి. కొద్దిపాటి ఉసిరికాయ రసాన్ని తీసుకుని దానికి తేనె కలిపి రెండుసార్లు తాగాలి. ఇలా చేయటం వల్ల గొంతు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
4. గోరువెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని రాత్రిపూట తాగి పడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. దానికి నల్ల మిరియాలు కలుపుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
5. గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానికి నిమ్మరసంతో పాటు తేనె కలుపుకుంటే గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది.
6. నాలుగు లేదా ఐదు ఆకుల తులసి తీసుకుని నీళ్ళలో వేడిచేయాలి. ఆ తర్వాత దానికి తేనె లేదా అల్లం కలుపుకుని తాగవచ్చు.
7. అల్లం టీ గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు గొంతు ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది.
8. ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, కొన్ని మిరియాలు వేసి కషాయం చేసుకోవాలి. ఈ కషాయాన్నినిద్రపోయే ముందు తాగడం వల్ల గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.