okra
Fresh Okra : బెండకాయలు వీటిని లేడీ ఫింగర్లని కూడా అంటారు. బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని, తెలివితేటలు పెరుగుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే చిన్న పిల్లలను బెండకాయలతో చేసిన కూరను ఎక్కువగా తినమని చెబుతారు. దీనిలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక పోషకాలు, ఖనిజాలు, ఉంటాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : ఎర్ర బెండతో ఎనలేని ప్రయోజనాలు..
బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నీరసం, అలసట తగ్గిస్తాయి. చురుకుగా ఉండేలా చేస్తాయి. బెండకాయలు తింటే షుగర్ స్ధాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించుకోవాలంటే బెండకాయలను రోజువారి ఆహారంలో చేర్చుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బెండకాయల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టటంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే సి విటమిన్ ఎముకలను బలంగా మారుస్తుంది.
అయితే మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్ళి బెండకాయలు కొనుగోలు చేసే ముందు చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇవి తాజాగా ఉన్నాయ, ముదిరిపోయినవా అన్న సందేహం కలుగుతుంది. అలాంటి వారు తాజాగా ఉండే బెండకాయలను ఏవిధంగా గుర్తించాలో, ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
READ ALSO : Lady Finger : మధుమేహులకు బెండకాయ దివ్యౌషధమే!
ప్రస్తుత రోజుల్లో రసాయనాలతో పండించిన బెండకాయలు వంటి కూరగాయలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. నిజానికి, ఈ బెండకాయను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి మేలు కలగకపోను నష్టం జరుగుతుంది. అందువల్ల బెండకాయలను కొనుగోలు చేయడానికి ముందు వాటిపై కొంత అవగాహన కలిగి ఉండటం అవసరం.
మంచి బెండకాయలను ఎంచుకోవటం ఎలా;
1. ముందుగా బెండకాయ చివర్లను తుంచేప్రయత్నం ;
బెండకాయలు ముదిరిపోయినవా లేక లేతవ అని తెలుసుకోవటం ముందుగా చేయాల్సిన పని. ఇందుకోసం బెండకాయ చివరన సన్నని ప్రాంతాన్ని తుంచాలి. చేతి వెళ్ళమధ్య ఉంచి తుంచితే సులభంగా చివరి ప్రాంతం తునికి కాయనుండి వేరైతే అది లేత బెండకాయలుగా నిర్ధారించుకుని వాటిని కొనుగోలు చేయాలి.
READ ALSO : Bloating : వేసవిలో కడుపు ఉబ్బరాన్ని నివారించే పానీయం ఇదే !
అదే ముదిరిపోయిన బెండకాయకు కాయచివరి ప్రాంతాన్ని వేళ్ళతో తుంచినా తునగదు. దీనిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాంటి వాటిని కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిది. ముదిరి పోయిన బెండకాయలు కూరగా వండుకోవటానికి పనికిరావు.
2. మంచి ఫైబర్స్ కోసం తాజాగా ఉండేవాటిని ఎంచుకోండి ;
పైన నూగుతో కూడిన సన్నని ముళ్ళతో ఉన్న బెండకాయలను కొనుగోలు చేయాలి. తాజా బెండకాయలు చూడగానే పై భాగంలో తాజాదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాజా ఉండే బెండకాయలో నీటితో సహా అన్ని రకాల విటమిన్లు ఉంటాయి. తాజాగా లేని బెండకాయలు వడబడి పోయి, ముడుచుకుపోయినట్లు ఉంటాయి.