Store Healthy Ginger : ఆరోగ్యానికి మేలు చేసే అల్లాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే?

నిత్యం ఉపయోగించే అల్లాన్నినిల్వచేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అల్లాన్ని ఎక్కువ రోజులు బయటఉంచితే ఎక్కువకాలం నిల్వఉండదు. త్వరగా ఎండిపోతుంది.

Store Healthy Ginger : అల్లం ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకుని తీసుకుంటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలి తిన్నా లేదంటే తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. ముఖ్యంగా చలికాలంలో అల్లం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.

నిత్యం ఉపయోగించే అల్లాన్నినిల్వచేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అల్లాన్ని ఎక్కువ రోజులు బయటఉంచితే ఎక్కువకాలం నిల్వఉండదు. త్వరగా ఎండిపోతుంది. చాలాకాలంలో ఉండేలా జాగ్రత్తగా నిల్వ ఉంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

అల్లం నిల్వ ఉండాలంటే ;

1. అల్లాన్ని కాగితం లేదా పాలిధీన్ సంచిలో వేసి ఫ్రిజ్ లో పెడితే చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.

2. అల్లాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్నముక్కులుగా కోసుకోవాలి. వీటిని అవెన్ లో బేక్ చేసి పొడిలా మార్చుకుని సీసాలో భద్రపరుచుకోవాలి. పండ్ల రసాల్లో , ఉదయం తయారు చేసుకునే టీలో, కుకీస్ లో , బ్రెడ్ తయారీల్లో వాడుకోవచ్చు.

3. వెనిగర్ లేదా నిమ్మరసంలో వేసి ఫ్రిజ్ లో ఉంచితే అల్లం నిల్వ ఉంటుంది.

4. అల్లం ముక్కలను ఫ్రీజర్ లో ఉంచి తరువాత వాటిని డబ్బాల్లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే రెండు నెలలపాటు నిల్వ ఉంటుంది.

5. అల్లాన్ని పొడిగా తుడిచి కాగితంలో చక్కగా చుట్టేసి ఉంచాలి. గాలి చొరబడకుండా పెట్టాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు