Pranayama : ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేలా చేసే ప్రాణాయామం!

ప్రాణాయామం ఒక ధ్యానం లాంటిది కాబట్టి ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే హార్మోన్లను విడుదల చేస్తుంది. అధిక రక్తపోటు తో బాధపడేవారు ప్రాణాయామం చేయడం చాలా మంచిది.

pranayama

Pranayama : శ్వాసను సరైన రీతిలో తీసుకునే ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. ఆధునిక జీవితంలో ఒత్తిడి వల్ల అనేక రకాల రోగాలు మనిషిని చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి నుండి తప్పించుకోవడం సాధ్యంకాని పరిస్ధితి. ఈ నేపధ్యంలో ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రాణాయామం ఎంతగానో తోడ్పడుతుంది.

ప్రాణాయామంతో ఉపయోగాలు ఇవే ;

1. ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలోని నరాలు యాక్టివ్ గా మారతాయి. శరీరంలో శక్తి తిరిగి నిక్షిప్తమౌతుంది. దీంతో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామం శారీరక దృఢత్వాన్ని ఇవ్వటంతోపాటు, శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించేలా చేస్తుంది. అంతేకాకుండా మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీర కాంతి వంతంగా మార్చి, శక్తిని పెంచుతుంది.

2. ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా మన మెదడులోని నరాల్లో ప్రశాంతత కలుగుతుంది. మన శరీరంలో రక్త ప్రసరణను పెరుగుతుంది.

3. ప్రాణాయామం ఒక ధ్యానం లాంటిది కాబట్టి ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే హార్మోన్లను విడుదల చేస్తుంది. అధిక రక్తపోటు తో బాధపడేవారు ప్రాణాయామం చేయడం చాలా మంచిది. అనుకోకుండా పెరిగే రక్తపోటును కంట్రోల్ చెయ్యడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ప్రాణాయామం రోజు క్రమం చేయడం వల్ల రక్తపోటుతో పాటు, డయాబెటిస్, డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా తగ్గుతాయి.

4. ప్రాణాయామం ఒక వ్యక్తి ఆయుష్షును పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన పద్ధతిలో ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మన ఆయుష్షు మన శ్వాస రేటుపై ఆధారపడి ఉంటుందని యోగ శాస్త్రం తెలియజేస్తుంది. బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేవారు ప్రాణాయామం చేయటం వల్ల శరీరంలోని కొవ్వు కరిగించుకుని బరువు సులభంగా తగ్గవచ్చు. దీని వల్ల అతిగా ఆహారం తినాలనిపించదు. దీంతో బరువు ఈజీగా తగ్గవచ్చు.

కాబట్టి ప్రాణాయామం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రాణాయామాన్ని సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో చేస్తే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే ముందు ప్రాణాయామం చేయటం వల్ల ఎంత తింటున్నారో దానిపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. దాని వలన మీ శరీరానికి కావలసినంత మాత్రమే తింటారు. యోగా శిక్షకుల సమక్షంలో ప్రాణాయామాన్ని చేసినట్లైతే వారు కొన్ని మెళుకువలు నేర్పే అవకాశం ఉంటుంది.