Dal Cooking : పప్పుల్ని నానబెట్టకుండా వండుతున్నారా..? ఎన్ని అనారోగ్య సమస్యలో తెలుసా..?

నాన్ వెజ్ కర్రీలో పప్పుచారు ఉంటే ఓ రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు. ఫ్రై కర్నీ, ఇగురు కూరలకు పప్పు చారు సూపర్ కాంబినేషన్. అటువంటి పప్పులు వండేటప్పుడు డైరెక్టుగా వండవద్దని చెబుతున్నారు నిపుణులు.

dal soke

Soak the dal cooking : వారానికి రెండు రోజులైన ఇంట్లో పప్పు వండాల్సిందే. కందిపప్పు, పెసరపప్పు ఇలా ఏదోక పప్పు ఇంట్లో నిత్యావసరంగా ఉంటుంది. కనీసం పోపులో అయినా ప్రతీరోజు పప్పులు ఉండాల్సిందే. అటువంటి పప్పులు వండే పద్ధతిలో కూడా ఆరోగ్యమే కాదు ఆదా కూడా ఉంటుందంటున్నారు. ఆదా అంటూ వంట గ్యాస్ ఆదా అన్నమాట. పప్పులు వండేటప్పుడు డైరెక్ట్ గా కంటే నానబెట్టి వండితే సమయానికి సమయం ఆదా..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు వంట గ్యాస్ కూడా అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

కందిపప్పు, పెసరపప్పు సెనగపప్పు ఇలా అన్ని రకాల పప్పులతో రకరకాల ఆహార పదార్థాలు, కూరలు వండుకుంటు ఉంటాం. ప్రోటీన్ కోసం పప్పుల వంటకాలు తినాలి. మాంసాహారులకు చికెన్ నుంచి ప్రోటీన్ అధికంగా అందుతుంది. శాకాహారులకు మాత్రం పప్పే ప్రధాన ఆధారం. మాంసాహారులైనా.. చికెన్, మటన్ వంటి కూరలు వండితే లిక్విడ్ డిష్ గా పప్పు చారు ఉండాల్సిందే. ఇది చాలామందికి ఉండే అలవాటు. నాన్ వెజ్ కర్రీలో పప్పుచారు ఉంటే ఓ రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు. ఫ్రై కర్నీ, ఇగురు కూరలకు పప్పు చారు సూపర్ కాంబినేషన్. ఇలా వంటకం ఏదైనా పప్పుల వంటకాలు మాత్రం ఉండాల్సిందే. అటువంటి పప్పులు వండేటప్పుడు డైరెక్టుగా కంటే నానబెట్టి వండితే రుచి, ఆరోగ్యం, వంటగ్యాస్ ఆదా అవుతుంది.

Moringa Flowers : అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచటంలో సహాయపడే మునగ పువ్వులు !

ఇప్పుడంటే ప్రెషర్ కుక్కర్లలో పప్పును డైరెక్ట్ గా వండేస్తున్నారు గానీ ఒకప్పుడు పప్పు వండాలంటే త్వరగా ఉండికేందుకు కనీసం గంట సేపైనా నానబెట్టి ఉడికించేవారు. కుక్కర్లు లాంటివి లేని సమయాల్లో పప్పు వండాలంటే కచ్చితంగా నానబెట్టి వండేవారు. కుక్కర్లో వండే పద్ధతి కంటే నానబెట్టి సంప్రదాయ వంట ఉత్తమమైనదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ఈరోజుల్లో త్వరగా వంట అయిపోవాలి. ఎందుకంటే దాదాపు మహిళలు అందరు ఏదోక ఉద్యోగాలు చేసేవారే ఉంటున్నారు. దీంతో సమయం ఆదా కోసం కుక్కర్లో పప్పును వండేస్తుంటారు. అలా కుక్కర్లో వండినా కుక్కర్లో ఉడకబెట్టడానికి ముందు పప్పును కనీసం రెండు నుంచి మూడు గంటలు నీళ్లలో నానబెట్టడం మంచిదని సూచిస్తున్నారు. పప్పును ముందుగా నానబెట్టడం వల్ల వండిన తర్వాత ఆ వంటకానికి మృదుత్వం, మంచి రుచి వస్తుంది. అంతేకాదు వంట సమయం ఆదా అవుతుంది. అంతేకాదు పప్పులు పాడవ్వకుండా నిల్వ ఉండటానికి కొన్ని పౌడర్లు కలుపుతారు. వాటిలో కెమికల్స్ ఉంటాయి. నానబెట్టి వండితే ఆ కెమికల్స్ శరీరంలోకి పోకుండా ఉండేందుకు నానబెట్టి వండటం బెటర్..నాన బెట్టిన నీటిలోకి పౌడర్ మొత్తం దిగిపోతుంది. ఆ తరువాత పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వండుకోవాలి.

ఆయుర్వేదం ప్రకారం పప్పును ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల అందులో ఉండే ఫైటిక్ ఆసిడ్లు, టానిన్ల శాతం తగ్గుతుంది. ఈ ఫైటిక్ ఆసిడ్లు, టానిన్లు ఉంటే పప్పు తిన్నాక మన శరీరం పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. నీళ్లలో నానబెట్టి పప్పు వండడం వల్ల అలాంటి సమస్యలు రావంటున్నారు నిపుణులు.

నానబెట్టకుండా వండిన పప్పు త్వరగా అరుదల కాదు. అలాగే పప్పు నానబెట్టి వండితే త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి నీళ్లలో నానబెట్టి పప్పును వండితే ఇలాంటి సమస్యలు రావు. అంతేకాదు పప్పులు ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల వాటిలోని ఆమ్ల ప్రభావాలు తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం పప్పు… నీళ్లలో నానితే వాటికి జీవం వస్తుందని అంటారు. శరీరానికి పప్పు అందించే ఆరోగ్య గుణాలు పెరుగుతాయి. అంతేకాదు పప్పులో ఉండే పోషకాలను శరీరం గ్రహించేలా చేయడానికి, జీర్ణక్రియ మృదువుగా జరిగేలా చూసుకోవడానికి పప్పులను నీళ్లలో నానబెట్టి ఆ తర్వాతే ఉడకబెట్టడం మంచిది.