Skin Health In Winter : శీతాకాలంలో చర్మ ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఇవే !

పోషకాలు అధికంగా ఉండే ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. శీతాకాలంలో అంటువ్యాధులతో పోరాడటానికి ఉసిరి ఎంతో సహాయపడుతుంది. ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం అనేది జుట్టు రాలడం, జీర్ణక్రియ, కంటి చూపుకు కూడా మంచిది.

These are the nutrient rich foods for skin health in winter!

Skin Health In Winter : శీతాకాలం సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చలి వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. పొడిగా మారుతుంది. అలాంటి సమస్యలు ఎదురవుతుంటే వాటి నుండి చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో వ్యాధుల బారిన పడుకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

1. ఉసిరి ; పోషకాలు అధికంగా ఉండే ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. శీతాకాలంలో అంటువ్యాధులతో పోరాడటానికి ఉసిరి ఎంతో సహాయపడుతుంది. ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం అనేది జుట్టు రాలడం, జీర్ణక్రియ, కంటి చూపుకు కూడా మంచిది. చలికాలంలో ఉసిరి పుష్కలంగా దొరుకుతుంది. ఉసిరిని చ్యవాన్‌ప్రాష్, షర్బత్ లేదా పచ్చడి, జామ్ రూపంలో కూడా ఆహారంలో తీసుకోవచ్చు.

2) చెరుకు ; చెరకు రుచికరంగా ఉండటమే కాదు శరీరానికి ఎంతో రీఫ్రెష్‌ను కూడా అందిస్తుంది. చలికాలంలో చెరుకును ఆహారంలో చేర్చుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్‌, ఎలక్ట్రోలైట్స్, కార్బొహైడ్రేట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు చెరుకు రసం ద్వారా పొందొచ్చు. అందుకే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నవారికైనా చక్కని ఆహారం ఏదంటే షుగర్ కేన్ జ్యూస్ అని చెప్పవచ్చు.

3) నువ్వులు ; రుచికరమైన, తీపి ఆహారాలలో నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వులు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అవసరమైన కొవ్వులు ఉండే నువ్వులు తింటే శరీరంలోని కీళ్లను బలం చేకూరుతుంది. చలికాలం ఆహారంలో నువ్వులను చేర్చుకోవడం చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.

4) బెర్రీలు ; చలికాలంలో బెర్రీలు శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు బెర్రీలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. బెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కలిగిస్తాయి.

5) చింతపండు లేదా పుల్లటి పండ్లు ; చలికాలంలో పండ్లు తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే చలికాలంలో సిట్రస్ పండ్లను తినడం మంచిది. చింతకాయ, నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.. దీనివల్ల శరీరానికి కావలసిన హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అందుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు వంటివి దరిచేరవు.