These are the skin beauty benefits of neem!
Beauty Benefits Of Neem : వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాను కలిగి ఉంది. వేప అనేక ఆయుర్వేద ఔషధాలలో ఒక మూలికగా ఉపయోగిస్తున్నారు. వేప మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మాన్ని అందంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. శతాబ్దాలుగా వేపను సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. జిడ్డు చర్మాన్ని తగ్గించడానికి వేప చక్కగా పనిచేస్తుంది. గాయాల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్లను తగ్గించి చర్మానికి హాని కలగకుండా చేస్తుంది. చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి బాగా పనిచేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. వేప పేస్టు తో చర్మసౌందర్యానికి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దం…
వేప వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ;
1. వేప చర్మానికి హానికరమైన యూవీ కిరణాలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్, ముడతలు, మొటిమలను నయం చేయడానికి సహాయపడుతుంది.
2. చర్మాన్ని తక్షణమే కాంతివంతంగా మార్చే శక్తి వేపకు ఉంది. దురదలు, మంటలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు.
3. ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది. డెలివరీ తర్వాత బాలింతలు వేప పేస్ట్ ను శరీరానికి అప్లై చేసుకొని స్నానం చేయడంతో చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
4. మొటిమలు , మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. వేప పేస్ట్ ముఖంపై ఏర్పడే మృత కణాలనుతొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నివారిస్తుంది.
5. చుండ్రు సమస్యలు, జుట్టు సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. వేపతో తయారయ్యే సబ్బులతో స్నానం చేసేవారు కోమలంగా, యవ్వనత్వంతో కనిపిస్తారు. చర్మంపై ఎలాంటి సమస్యలు ఉన్నా వేపాకులు పోగొడతాయి.
6. ఆయిల్ స్కిన్ కలిగిన వారికి వేపాకులు ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా చేస్తాయి. అదేవిధంగా డ్రై స్కిన్‍కి మాయిశ్చరైజర్‌లా కూడా పనిచేస్తాయి. వేపాకుల పేస్టుతో స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది. దానికి కొద్దిగా రోజ్ వాటర్, గంధపు పొడి, ఆలివ్ ఆయిల్, లేదా కమలాపండు తొక్కల పొడి కలిపితే రకరకాల చర్మవ్యాధులు తొలగిపోతాయి.