Depression : మగవారిలో డిప్రెషన్ లక్షణాలు ఇవే…

కొంతమంది పురుషులు తమ డిప్రెషన్‌ నుండి బయటపడేందుకు ఇతరుల సహాయం తీసుకోవాలన్న ఆలోచన చేయరు. మరి కొంతమంది తమలోని డిప్రెషన్ తాలూకా సమస్యలు గుర్తించినప్పటికీ ఇతరులతో చర్చించేందుకు ఇష్టపడరు.

Depression : ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో డిప్రెషన్ కు లోనవటం సహజంగానే జరుగుతుంటుంది. పురుషులు, మహిళలని తేడాలేకుండా డ్రిపెషన్ ను అనుభవించాల్సి వస్తుంది. డిప్రెషన్ అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి, ఇది వ్యక్తుల ఆలోచనలు, భావాలు, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. పురుషుల కంటే స్త్రీలు డిప్రెషన్‌కు ఎక్కువగా గురవుతారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే వాస్తవానికి మహిళలకన్నా పురుషులో ఎక్కవగా డిప్రెషన్ కు లోనవుతారని పరిశోధకులు చెబుతున్నారు.

పురుషులు తరచుగా డిప్రెషన్ బారినపడుతూ ఉంటారు. ఎందుకంటే పురుషులలో అనేకమంది, తమ భావాలను వ్యక్తంచేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామాజిక, జీవన పరిస్ధితుల కారణంగా పురుషులు నిరాశను వ్యక్తపరచలేక పైకి ఊందాగా తనలోని భావోద్వేగాలను అణగదొక్కుకుంటుంటారు. ఫలితంగా ఎక్కువ డిప్రెషన్ కు గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో పురుషులలో డిప్రెషన్ ను నిర్ధారణ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. ఈ పరిస్ధితిల్లో చాలా మంది పురుషులు, తలనొప్పి, వెన్నునొప్పి, నిద్రలేమి ,లైంగిక సమస్యల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక సమస్యలకు చేరువవుతుంటారు. అందుకే పురుషులలో డిప్రెషన్ గుర్తించటం అంత ఈజీ కాదు.

పురుషులలో డిప్రెషన్ యొక్క శారీరక లక్షణాలు ;

డిప్రెషన్ మొదట పురుషులలో శారీరకంగా వ్యక్తమవుతుంది. డిప్రెషన్ అంటే చాలా మంది సాధారణంగా ఇది మానసిక అనారోగ్యంగా భావిస్తూ ఉంటారు. అయితే అది శారీరపరంగా కూడా వ్యక్తమవుతుంది. అనే మంది పురుషులు మానసిక సమస్యలను పక్కన పెట్టి శారీరక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నట్లుగా వైద్యుల వద్దకు చికిత్సకు వెళుతుంటారు. దీంతో అసలు సమస్య పక్కకు వెళుతుంది.

మానసిక ఆందోళన కలిగిన పురుషుల్లో గుండెల్లో దడ, గ్యాస్, డయేరియా మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు , అంగస్తంభన , ఇతర లైంగిక సమస్యలు, తలనొప్పులు ,తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు హార్మోన్ల సమస్య, అనుకోకుండా బరువు తగ్గడం ,కొన్నిసార్లు బరువు పెరగడం వంటివి పురుషులలో కనిపించే ముఖ్యమైన డిప్రెషన్ తాలుకా భావోద్వేగ లక్షణాలు.

కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ కారణంగా ఆందోళన, దూకుడు, కోపం, స్నేహితులు, కుటుంబం ,సహోద్యోగులకు దూరంగా మెలగటం, నిస్సహాయత, పనిపై ఆసక్తి లేకపోవడం, చంచలత్వంతో వ్యవహరించటం తదితర లక్షణాలను కలిగి ఉంటారు. చాలా మంది పురుషులు సమాజంలో ఉన్న విలువలు కాపాడుకోవాలన్న తాపత్రయంతో వారి భావోద్వేగ, శారీరక ,మానసిక ఆరోగ్యాన్ని వారి చేతులారా ప్రమాదంలో పడేసుకుంటున్నారు.

కొంతమంది పురుషులు తమ డిప్రెషన్‌ నుండి బయటపడేందుకు ఇతరుల సహాయం తీసుకోవాలన్న ఆలోచన చేయరు. మరి కొంతమంది తమలోని డిప్రెషన్ తాలూకా సమస్యలు గుర్తించినప్పటికీ ఇతరులతో చర్చించేందుకు ఇష్టపడరు. తమ పరిస్ధితిని తెలిపితే ఇతరుల నుండి వచ్చే స్పందన ఎలా ఉంటుందోనని భయపడుతుంటారు. డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నవారు దాని నుండి త్వరగా బయటపడేందుకు మానసిక వైద్యుని సంప్రదించి చికిత్స పొందటం మేలు. వారు సూచించిన మందులను, సూచనలను క్రమంతప్పకుండా అనుసరించడం వల్ల సమస్య నివారణకు అస్కారం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు