Ustrasana : నడుము నొప్పితోపాటు, శ్వాససంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగించే యోగాసనం ఇదే!

శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరటంచంతోపాటుగా, ఉబ్బసం తో బాధపడేవారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది.

Attractive Asian woman practice yoga Ustrasana pose or yoga Camel pose to meditation in bedroom after wake up in the morning Feeling so comfortable and relax,Yoga for Healthcare Concep

Ustrasana : మానసిక , శారీరక ప్రశాంతతను కలిగించటంలో యోగా ముఖ్యభూమిక పోషిస్తుంది. యోగా శరీరకంగా ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇలాంటి యోగాలో అతి ముఖ్యమైన యోగాసనం ఉష్ట్రాసనం. ఇది అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ముఖ్యంగా మహిళలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే నడుం నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది.

అంతేకాకుండా గొంతు సమస్యలు,శ్వాస సంబంధమైన ఆస్త్మా, అలర్జీ, సైనస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాళ్ళు, తొడలు, చేతులు, భుజాలు బలోపేతం చేసి సత్తువ నిస్తుంది. శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరటంచంతోపాటుగా, ఉబ్బసం తో బాధపడేవారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనం వేయటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మడమలు, తొడలు, శరీరం, గొంతు, కటి, పొత్తి కడుపు ధృడంగా మారతాయి.

ఉష్ర్టాసనం వేసే విధానం ;

మోకాళ్లను మడిచి కూర్చోవాలి. తర్వాత ఎడమ చేతిని, తలను పైకెత్తాలి. తర్వాత నడుమును వెనక్కి వంచుతూ, కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉన్న తర్వాత పూర్వపు స్థితికి రావాలి. తర్వాత కుడి చేతిని, తలను పైకెత్తి, నడుమును వంచుతూ, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. ఆరుసెకన్షపాటు ఈ భంగిమలో ఉన్న తర్వాత పూర్వ స్థితికి రావాలి.

గమనిక ; ఈ ఆసనాన్ని గర్భిణీ స్త్రీలు, గుండె జబ్బులు ఉన్నవారు వేయరాదు. నిపుణుల సమక్షంలో వేయటం మంచిది.