Clean The Kidneys : కీడ్నీలు శుభ్రపడాలంటే ఇంట్లోనే తయారైన ఔషదంతో!

వయస్సుకు తగిన బరువును మెయింటైన్ చేయాలి. అధికబరువును తగ్గించుకోవాలి. రోజూ వ్యాయామం తప్పనిసరి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో ఉండాలి.

Clean The Kidneys : శరీరంలో కిడ్నీలు కీలక విధులను నిర్వర్తిస్తుంటాయి. వీటికి అంతరాయం ఏర్పడితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవనశైలి సక్రమంగా ఉంటే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలతో మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు. సూచిస్తున్నారు.

అయితే కొన్ని గృహ చిట్కాలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందుగాను కొత్తిమీర, కరివేపాకు కిడ్నీల నుండి వ్యర్ధపదార్ధాలను తొలగించి క్లీన్ చేసేందుకు బాగా ఉపకరిస్తాయి. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కిడ్నీలను క్లీన్ చేసే కరివేపాకు, కొత్తిమీర ;

ముందుగా ఒక కొత్తిమీర కట్టను లేదంటే కరివేపాకు కట్టను తీసుకోవాలి. అనంతరం దానిని శుభ్రంగా కడుక్కోవాలి. చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో మంచినీరు పోసి పదినిమిషాలపాటు బాగా మరిగించాలి. అనంతరం పొయ్యి మీద నుండి దించి చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఒక గ్లాసులో పోసుకుని తాగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం తగ్గుతుంది.

ఈ జాగ్రత్తలు అవసరమే ;

వయస్సుకు తగిన బరువును మెయింటైన్ చేయాలి. అధికబరువును తగ్గించుకోవాలి. రోజూ వ్యాయామం తప్పనిసరి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో ఉండాలి. వంటచేసేటప్పుడు శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. రక్తపోటును నియంత్రించుకోవాలి.

మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను మానుకోవాలి. ఉప్పును మితంగా వాడాలి. మాంసాహారాన్ని పరిమితం తీసుకోవడంతో పాటు చేపలను వారానికి రెండు సార్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంశపారంపర్యంగా కిడ్నీ జబ్బులున్నాయా అనేది ఆరా తీయాలి. ఒకవేళ ఉంటే వైద్యుల సలహాలు పాటించాలి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు