UNICEF‌.. పిల్లలకు బలమైన ఆహరం ఇదే!

  • Publish Date - November 18, 2019 / 04:13 AM IST

పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు అనుకుంటాం. కానీ నిజానికి పిల్లల్లో అయినా.. పెద్దల్లో అయినా.. అధిక బరువు మంచిది కాదు. పిల్లల్లో ఈ మధ్య చాలామందికి స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. చిరుతిండ్లకి, జన్క్ ఫుడ్ కి బాగా అలవాటుపడటం, ఆటలాడకపోవటం, వ్యాయామాలు లేకపోవటంతో పిల్లల్లో కొవ్వు కొండల్లా పేరుకుపోతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌లు వస్తున్నాయి. 

మరి ఈ సమస్యలను నివారించేందుకు తీసుకోదగిన చౌకైన పౌషకాహారం గురించి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ (UNICEF‌) తన బుక్‌లెట్‌లో పేర్కొంది. అంతేకాదు తాజాగా 28 పేజీల పుస్తకం తయారుచేసి అందులో ఆహార పదార్థాల వంటకాలను, వాటి తయారీకి అయ్యే ఖర్చును కూడా ఇస్తుంది. మరి అవేంటో చూద్దాం.

UNICEF సర్వే ప్రకారం అయిదేళ్ల వయస్సులోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల లోపంతో, బాలల్లో 18 శాతం రక్తహీనత సమస్య ఉంటోందని వెల్లడైంది. అందుకే.. పిల్లల్లో తక్కువ బరువు సమస్యను అధిగమించేందుకు ఆలూ పరాఠా, పనీర్‌ కఠి రోల్, సగ్గుబియ్యం కట్‌లెట్‌ వంటివి.. స్థూలకాయ సమస్య నివారణకు మొలకెత్తిన పప్పుగింజలతో పరాఠాలు, పోహా, ఉప్మా మొదలైన ఆహారం అందించవచ్చని సూచించింది.  

అంతేకాదు  రాగి జావ‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతోంది. అధిక బరువును తగ్గించడంలో, శరీరానికి మానసిక ప్రశాంతతను అందజేయడంలో రాగులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు