Banana Tree : అరటి చెట్టులో ఔషదగుణాల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే?

అతిగా వేడి చేయటం పైత్యం వంటివి తగ్గాలంటే అరటి చెట్టు వేరును మెత్తగా నూరి రసం తీసి రెండు చెంచాలు ఒక కప్పు నీటిలో కలిపి తాగుతుంటే అతి వేడి , అతిపైత్యం రెండు రోజుల్లో తగ్గుతుంది.

What does Ayurveda say about the medicinal properties of the banana tree?

Banana Tree : అరటి చెట్టు ఔషదగుణాల గురించి ఇప్పటి వారికి తెలియదు. పచ్చి అరటికాయలతోపాటు, అరటిపువ్వు, అరటి మొవ్వ, అరటి దుంప, వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అనేక రోగాలను అరికట్టే గుణం వీటిలో ఉంది. అరటి ఆకులో భోజనం చేయటం చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తుంది. అరటి చెట్టు రసం తీపి వగరు, రుచులను కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగి స్తుంది. వాతాన్ని పెంచి వీర్యపుష్టినిస్తుంది. శరీరానికి చలువనిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లను కరిగించటంతోపాటు, ఉదరంలోని క్రిములను , సెగరోగములను ,రక్తపైత్యాన్ని పోగొడుతుంది. అందుకే పూర్వికులు ఇంటి పెరట్లో ఒక అరటి చెట్టునైనా నాటుకునే వారు.

అరటి పూవును వడియాలుగా పెట్టుకుంటారు. రుచిగా ఉండటంతోపాటు దగ్గు, ఆయాసం, వంటి శ్వాసరోగాలను పోగొట్టటంలో సహాయకారిగా పనిచేస్తుంది. జ్వరం , క్షయం, వాతం, దగ్గు, ఉబ్బసం మొదలైన వ్యాధులను అణచివేయటంతోపాటు విషప్రభావాన్ని హరించటంలో అరటి ఆకులు బాగా ఉపకరిస్తాయి. బాగా మగ్గిన అరటి పండు ఒకటి ఆవు నెయ్యిలో కలిపి తీసుకుంటే అతిరుతువు ఆగిపోతుంది. స్త్రీలలో గర్భాశయ రోగాలను నివారించుకునేదుకు పచ్చి ఉసిరకాయ రంసంలో, అరటిపండ్లను కలిపి కొంచెం తేనె, పటిక బెల్లం కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి కాలిన గాయాలపై లేపనంగా రాస్తే గాయానికి సంబంధించిన మంట, నొప్పి తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. పచుపచ్చని అరటి పండు తింటే మూత్రంలో మంట తగ్గటమే కాక మూత్రాశయం శుభ్రపడుతుంది. తెల్లబొల్లి మచ్చలు తగ్గాలంటే అరటి చెట్టూ దూటరసం తీసి పసుపు కలిపి లేపనంగా రాస్తే తెల్లబొల్లి త్వరగా నివారించవచ్చు. అన్ని రకాల కడునొప్పుల నివారణకు అరటి చెట్టును ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి. ఆ బూడిదను 2 గ్రాముల మోతాదులో ఒక కప్పు నీటిలో కలిపి రోజూ మూడు పూటలా తాగితే ఉదర రోగాలు తగ్గుతాయి.

అతిగా వేడి చేయటం పైత్యం వంటివి తగ్గాలంటే అరటి చెట్టు వేరును మెత్తగా నూరి రసం తీసి రెండు చెంచాలు ఒక కప్పు నీటిలో కలిపి తాగుతుంటే అతి వేడి , అతిపైత్యం రెండు రోజుల్లో తగ్గుతుంది. పులి త్రేన్పులు సమస్య ఉంటే అరటి ఆకులను బాగా ఎండబెట్టి కాల్చి ఆ బూడిదను రెండు చిటెకెల మోతాదులో ఒక స్పూను తేనెలో కలిపి రెండు పూటలా తీసుకుంటే పులి త్రేన్పులు తగ్గుతాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.