What precautions are necessary to prevent sugar levels from rising in winter?
Prevent Sugar Levels : చలికాలం వచ్చేసింది. రుతువులు మారుతున్న కొద్దీ మధుమేహాన్ని నియంత్రించుకోనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. శీతాకాలం మధుమేహాన్ని ఎదుర్కోవటానికి కొంచెం సవాలుగా ఉంటుంది. చల్లని వాతావరణంలో అనేక వైరస్ లు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే చల్లని గాలి వైరస్‌లు వెచ్చని వాతావరణంలో కంటే ఎక్కువసేపు అతుక్కోని ఉంటాయి. రైనోవైరస్ వంటి కొన్ని వైరస్‌లు చల్లని ఉష్ణోగ్రతలలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి.
చలి కాలంలో షుగర్ స్ధాయిలు ఆకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే శీతాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో శరీరం చల్లని ఉష్ణోగ్రతకు గురవుతుంది. అందుకే, ఈ కాలంలో సాధారణం కంటే ఎక్కువ ఆకలేస్తుంది. ఎక్కువ ఆహారం తింటే అది మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి, ఆహారంలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా చూసుకోండి.
ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో పలు మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో పెట్టవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ఉండే ప్రొటీన్స్, విటమిన్ సీ వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కమలాలు, బత్తాయిలు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గుతుంది. ఈ సీజన్‌లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి వాటిని తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జామకాయలో విటమిన్ ఏ, సీలు చక్కెర స్థాయిని సులువుగా తగ్గిస్తాయి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని కొవ్వుని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి.
ఒత్తిడి మధుమేహానికి ప్రధాన కారణం. అధిక ఒత్తిడి టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. మరోవైపు, అధిక ఒత్తిడి కార్టిసాల్ ఉత్పత్తికి కూడా కారణమవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని మరింత ప్రభావితం చేస్తుంది. తేలికపాటి వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని కంట్రోల్ లో పెట్టటంతోపాటు డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు. శరీరం ఆరోగ్యకరమైన షుగర్ లెవల్‌ను నిర్వహించడానికి క్రమం తప్పకుండా ఏదైనా శారీరక వ్యాయామం చేయండి. 15 నిమిషాల పాటు వ్యాయామం మీ గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.