Belly Fat
Belly Fat : సమతులాహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ కు అలవాటు పడటం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోతున్నాయి. పొట్టచుట్టూ చుట్టూ పేరుకునే కొవ్వుని బెల్లీ ఫ్యాట్ అంటారు. ఇది సన్నగా ఉండే వారిలో కూడా ఉంటుంది. ఆహారం నుండి మానసిక ఒత్తిడి, నిద్ర వరకూ దేనివల్లనైనా ఈ బెల్లీ ఫ్యాట్ ఏర్పడవచ్చు. బెల్లీ ఫ్యాట్ రావడం వల్ల మీ శరరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఇది కొద్ది కొద్దిగా మీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అంతేకాదు దీనిని వదిలించుకోవడం కూడా అంత సులువు కాదు. చాలా కష్టమైన వర్కవుట్స్ చేయాల్సిఉంటుంది. అంతేకాదు ఆహారం విషయంలో ప్రత్యేక డైట్ మెయింటెన్ చేయాలి.
కొవ్వు అనేది సులభంగా పేరుకుంటుంది. అయితే దురదృష్టవశాత్తూ దీనిని వదిలించుకోవటం చాలా కష్టం. అవయవాల రక్షణ కోసం కొంత కొవ్వు చుట్టూ ఉండటం మంచిదే కానీ అయితే అది మితిమీరితే మాత్రం ప్రమాదకరం. సమతులాహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ కు అలవాటు పడటం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోతున్నాయి. ట్రాన్స్ ఫ్యాట్ అనేది చాలా చెడ్డ కొవ్వు. బెల్లీ ఫ్యాట్‌కి ఇదే కారణం. ఇది మొత్తం శరీర బరువును పెంచుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురిచేస్తుంది. కాల్చిన, ప్యాక్ చేసిన ఆహారాలలో ఇది ఎక్కువగా ఉంటుంది.
ఆల్కహాల్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఆల్కహాల్‌లో అధిక కేలరీలు ఉంటాయి. ఎటువంటి పోషకాలు ఉండవు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. బరువు విపరీతంగా పెరుగుతారు. అందుకే మద్యపానం మానేయ్యడం మంచిది.శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. శారీరక శ్రమ చేయకపోతే బెల్లీఫ్యాట్ కరగడం అసాధ్యం. రెగ్యులర్ వ్యాయామం వల్ల ఫిట్‌గా ఉంటారు. వర్కవుట్స్ వల్ల బెల్లీ ఫ్యాట్ నెమ్మదిగా కరిగించవచ్చు.
మీ ఆహారపు అలవాట్లు కూడా మీ బరువును ప్రభావితం చేస్తాయి. ఎక్కువ చక్కెరను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. చక్కెర ఆహారాలు, పానీయాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు బర్న్ చేయడం చాలా కష్టం. అవి చివరికి కొవ్వుగా నిల్వ అవుతాయి. అందుకే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఒత్తిడి, ఆందోళన వల్ల శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేయడానికి కారణమవుతుంది. ఇది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల బెల్లీఫ్యాట్ పెరుగుతుంది. తక్కువ నిద్ర కూడా కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా తొడలు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక మొత్తంలో చక్కెరలు, ఉప్పు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి వల్లనే ప్రమాదకరమైన కొవ్వులు శరీరంలో పోగుపడతాయి. నిత్యం వ్యాయామాలు చేస్తూ బెల్లీ ఫ్యాట్ తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.