Sunday: సండే సెలవు ఎప్పుడు మొదలైంది.. ఎవరు మొదలుపెట్టారు
సోమవారం నుంచి శనివారం వరకూ ఆరు రోజుల పాటు పనిచేసి ఆదివారం కోసం ఎదురుచూస్తాం. ఎందుకంటే ఆదివారం సెలవు. పిల్లలు సరదా కోసం, పెద్దవాళ్లు విశ్రాంతి కోసం, చాలా మంది పని ఒత్తిడి తగ్గడం...
- Subhan Ali Shaik
- Published On : February 27, 2022 / 06:14 PM IST
Sunday
Sunday: సోమవారం నుంచి శనివారం వరకూ ఆరు రోజుల పాటు పనిచేసి ఆదివారం కోసం ఎదురుచూస్తాం. ఎందుకంటే ఆదివారం సెలవు. పిల్లలు సరదా కోసం, పెద్దవాళ్లు విశ్రాంతి కోసం, చాలా మంది పని ఒత్తిడి తగ్గడం కోసం.
ఎప్పుడైనా సండే సెలవు ఎందుకొచ్చిందని ఆలోచించారా.. అసలు దాని చరిత్ర ఏంటి.. ఎప్పుడు మొదలైంది.
321 మార్చి 7వ సంవత్సరం
ఫస్ట్ రోమన్ రూలర్ అయిన కాన్‌స్టన్టైన్ అనే తొలి రోమన్ చక్రవర్తి. క్రిష్టియానిటీని ఫాలో అవుతూ ఆదివారం చర్చిలకు అటెండ్ అవ్వాలని సండేని పబ్లిక్ హాలీడేగా ప్రకటించారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ ISO ప్రకారం.. సండేను వారానికి చివరి రోజుగా గుర్తించి కామన్ హాలీడేగా ప్రకటించారు.
Read Also : ఆ ఊర్లో ఆదివారం మాంసాహారం వండితే ఫైన్
అసలు ఈ Sunday పదాన్ని ఇంగ్లీష్ పురాతనమైన పదం ”Sunnandaeg” నుంచి తీసుకొచ్చారు. దానిని జర్మన్ లో సన్స్ డే.. సూర్యుడి రోజు అని నిర్వచిస్తారు. జర్మనిక్, నార్స్ మైథాలజీ ప్రకారం సూర్యుడు దేవుడని, Sunna, Solపేర్లతో పిలుస్తుంటారు.
1890 జూన్ 10న బ్రిటీష్ గవర్నమెంట్ ఆదివారాన్ని పబ్లిక్ హాలీడే గా ప్రకటించింది.
అంతకంటే ముందు 1844లో గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటీష్ ఆదివారాన్ని స్కూల్ కు వెళ్లే స్టూడెంట్స్ కోసం హాలీడేగా అనౌన్స్ చేశారు.
