కరోనా వైరస్ మొదట్లో కంటే వచ్చే చలికాలంలోనే ప్రాణాంతకమంటున్న సైంటిస్టులు!

  • Publish Date - July 14, 2020 / 10:19 PM IST

Winter wave of coronavirus : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.. కరోనా వైరస్ ఉద్భవించి దాదాపు ఆరు నెలలు అవుతున్నా వైరస్ తీవ్రత మాత్రం జన్యుమార్పులతో మరింత విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో వచ్చే చలికాలంలోనూ కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్లలో యూకేలో 120,000 కొత్త కరోనావైరస్ మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక ఆస్పత్రుల్లో 24,500 నుంచి 2,51,000 మధ్య వైరస్ సంబంధిత మరణాలు నమోదయాయ్యని సూచిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయిగా చెప్పారు. ఇఫ్పటివరకూ యూకేలో 44,830 అధికారిక మరణాలు నమోదయ్యాయి. జూలైలో 1,100 మరణాల సంఖ్య కాస్త తగ్గినట్టుగా కనిపించింది. ఇందులో లాక్ డౌన్లు, చికిత్సలు లేదా టీకాలను పరిగణనలోకి తీసుకోలేదని సైంటిస్టులు తెలిపారు.
చల్లటి వాతావరణంలోనే.. వైరస్ వేగంగా సోకుతుంది :
మహమ్మారి విషయంలో ముందుగానే చర్యలు తీసుకుంటే తీవ్రతను తగ్గించవచ్చునని UK చీఫ్ శాస్త్రీయ సలహాదారు, Sir Patrick Vallance సూచిస్తున్నారు. కరోనా వైరస్ ఈ శీతాకాలంలో మరింత విజృంభించే ప్రమాదం ఉందన్నారు.

కరోనా వైరస్ చల్లటి పరిస్థితులలో ఎక్కువ కాలం జీవించగలదని, బయటి సూర్యుని వాతావరణంలో కంటే ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపితే వైరస్ వ్యాప్తి అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మొదటి కరోనా మహమ్మారి వేవ్ తరువాత హెల్త్ సర్వీసు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఏడాది చివరి నాటికి 10 మిలియన్ల మందికి చేరడం మరింత కష్టతరంగా మారొచ్చునని నివేదిక హెచ్చరిస్తోంది.

కేవలం ఇది ఒక అంచనాగా భావించరాదని, ఒక అవకాశమని సౌతాంప్టన్ NHS ట్రస్ట్‌ శ్వాసకోశ నిపుణుడు స్టీఫెన్ హోల్గేట్ సూచించారు. ఈ శీతాకాలంలో కోవిడ్ -19 కొత్త తరంగంతో మరణాలు ఎక్కువగా నమోదు కావొచ్చునని నివేదిక హెచ్చరిస్తోందని చెప్పారు.

ఈ విషయంలో ముందుగానే చర్యలు తీసుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చునని అన్నారు. ప్రస్తుతం UKలో కరోనావైరస్ మరణాలు, కేసులు తగ్గాయని చెప్పారు. దేశంలో రెండవ తరంగానికి ముందు అవకాశమని అన్నారు. వైరస్ ఇంకా పోలేదని, మన దగ్గర టీకా కూడా లేదని గుర్తు చేశారు. కరోనా సోకితే ఐసోలేషన్ వంటి చర్యలు చేయడం.. తాత్కాలిక చికిత్స చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు.

కోవిడ్ ‘సెకండ్ వేవ్‌’‌ను ముందే ఎదుర్కొంటాం :
కరోనావైరస్.. ఫ్లూ, ఇతర శీతాకాలపు ఇన్ఫెక్షన్ల అతివ్యాప్తి లక్షణాలను ఎదుర్కోవటానికి పరీక్ష లాంటిదిగా పేర్కొన్నారు. ఎక్కువ మందికి ఫ్లూ వ్యాక్సిన్ వేయడం ఆస్పత్రులు, సంరక్షణ గృహాలకు తగినంత వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) ఉన్నాయని భరోసా ఇచ్చేలా ఉండాలని సూచిస్తున్నారు. అంటువ్యాధులను నిరోధించడానికి ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లను మరిన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య కార్యదర్శి Matt Hancock తెలిపారు. కరోనా సెకండ్ వేవ్  ముందుగానే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు