Heart Palpitations : గుండె దడతో అందోళన చెందుతున్నారా? ముప్పు పొంచి ఉన్నట్లేనా?

వాస్తవానికి గుండె వేగం ఏప్పుడూ ఒకేలా ఉండదు. చేసే పనులు, శరీర ఉష్ణోగ్రతలు, వయసును బట్టి మారుతుంది. విశ్రాంతి తిసుకునే సమయంలో గుండె వేగం నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది.

Heart Palpitations : మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఇది సర్వసాధారణం. ఇటీవలి కాలంలో పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్ ల వంటి పరికరాలు వాడుకతో గుండె వేగాన్ని చాలా మంది గమనించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో గుండె వేగం పెరగటం, మరికొన్ని సందర్భాల్లో గుండె వేగం తగ్గుతుండటంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్ధితి మరింత గుండె వేగం పెరగటానికి దారితీస్తుంది.

వాస్తవానికి గుండె వేగం ఏప్పుడూ ఒకేలా ఉండదు. చేసే పనులు, శరీర ఉష్ణోగ్రతలు, వయసును బట్టి మారుతుంది. విశ్రాంతి తిసుకునే సమయంలో గుండె వేగం నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. ఏదైనా పనిలో ఉన్న సందర్భంలో శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గుండె వేగం పెరుగటం అన్నది సాధారణమే. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు గుండె 10 సార్లు అధికంగా కొట్టుకుంటుంది.

కఠినమైన శారీరక శ్రమలు, వ్యాయామాలు చేసిన సందర్భంలో గుండె 180 సార్ల వరకు కొట్టుకుంటుంది. దీనినే గరిష్ట గుండె వేగంగా చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో భయపడాల్సిన పనిలేదు. కొవిడ్ కారణంగా చాలా మందిలో గుండె దడ, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించటం మంచిది. అవసరమనుకుంటే వారి సూచనమేరకు ఈసీజీ, ఎకో పరీక్షలు చేయించుకోవాలి. ఏమైనా తేడాలు ఉంటే చికిత్స పొందటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు