Drishyam 3 Review : ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ.. గత రెండు దృశ్యం సినిమాలని మించి మెప్పించిందా?
దృశ్యం, దృశ్యం 2 సినిమాలు మళయాలంలో హిట్ అవ్వడంతో వేరే భాషల్లోకి రీమేక్ అయ్యాయి. (Drishyam 3 Review)
Mohanlal Drishyam 3 Review
Drishyam 3 Review : మోహన్ లాల్, మీనా జంటగా దృశ్యం రెండు పార్టులకు మరో సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా దృశ్యం 3. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మాణంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సిద్దికీ, ఆశ శరత్, మురళి గోపీ, అన్పిబ హస్సన్, ఎస్తేర్ అనిల్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. దృశ్యం 3 సినిమా నేడు మే 21న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
జార్జ్(మోహన్ లాల్)తన కథని నిర్మాతగా సినిమా తీసి హిట్ కొడతాడు. తన ఫ్యామిలీ అంతా గతం మర్చిపోయి తమ పనులు చేసుకుంటారు. జార్జి తన కూతురు అంజు(అన్పిబ హస్సన్)కి పెళ్లి చేద్దామని ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ ఎవరో తన కూతురుకు వచ్చే సంబంధాలు చెడగొడుతున్నారు అని జార్జ్ కి తెలుస్తుంది. వరుణ్ తల్లి(ఆశ శరత్) గీత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆరోగ్యం పాడవడంతో ఆమె భర్త ప్రభాకరన్(సిద్దికీ) మళ్ళీ జార్జ్ లైఫ్ లోకి వచ్చి గతంలో జార్జ్ కేసు వల్ల సస్పెండ్ అయిన సహదేవన్(షాజాన్) సహాయంతో ఎలాగైనా అంజు పెళ్లి ఆపాలని, ఆమెని జైలుకు పంపాలని ప్రయత్నాలు చేస్తాడు.
దీంతో సహదేవన్ మళ్ళీ వరుణ్ ని జార్జ్ మాయం చేసాడు అనడానికి ఆధారాల కోసం కేసుని రీసెర్చ్ మొదలుపెడతాడు. ఈ విషయం జార్జ్ కి తెలుస్తుంది. మరి జార్జ్ తప్పు చేసాడని నిరూపిస్తారా? అంజు పెళ్లి ఆపుతారా? అంజుని జైలుకు పంపిస్తారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Pawan Kalyan MEGA 158 : మెగాస్టార్ చిరంజీవి 158వ మూవీ లాంచ్.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్
సినిమా విశ్లేషణ..
దృశ్యం, దృశ్యం 2 సినిమాలు మళయాలంలో హిట్ అవ్వడంతో వేరే భాషల్లోకి రీమేక్ అయ్యాయి. తెలుగులో వెంకటేష్ చేసారు. కానీ ఇప్పుడు పార్ట్ 3 మాత్రం మలయాళం సినిమానే తెలుగులో డబ్బింగ్ చేసారు. ఫస్ట్ రెండు సినిమాలు కూడా ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ట్విస్టులు రివీల్ చేసి సస్పెన్స్ లు ఇవ్వడంతో ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఈ పార్టీ 3 కూడా అదే ఫార్మేట్.
ఫస్ట్ హాఫ్ అంతా జార్జ్ ఫ్యామిలీ, అతను సినిమా తీయడం, అంజు పెళ్లి ప్రయత్నాలు, వరుణ్ కేసుని ఎవరో రిపోర్టర్ మళ్ళీ రీసెర్చ్ చేయడంతో సాగుతుంది. ఎవరో తమకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారని జార్జ్ కి తెలియడంతో ఇంటర్వెల్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంటుంది. అయితే సెకండ్ హాఫ్ అంతా అంజు చుట్టూ, అంజుని కాపాడుకోవడానికి జార్జ్ ఏం చేసాడు, ఆమె పెళ్లి చుట్టూ జరుగుతుంది.
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు మాత్రం ఈ సారి సింపుల్ గానే ఉన్నాయి. ఇలాంటి ట్విస్ట్ లు చాలా సినిమాల్లో చూసేసాము. మొదటి రెండు సినిమాల్లో ఉన్నంత బలంగా ఈ పార్ట్ 3లో ట్విస్ట్ లు లేకపోవడం గమనార్హం. పైగా క్లైమాక్స్ లో జార్జ్ పోలీసులకు తప్పు చేశాను అని ఒప్పుకొని లొంగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత రెండు సినిమాలు వరుణ్ మర్డర్ కేసు చుట్టూ తిరిగాయి, అతని అవశేషాలు కనపడకుండా జార్జ్ ఏం చేసాడు అని నడిపించారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ట్విస్ట్ లు.
అయితే దృశ్యం 3 మాత్రం పాత కేసుకి లింక్ ఉన్నా ఒక రివెంజ్ డ్రామా, కూతుర్ని కాపాడుకోవడానికి తండ్రి ఏం చేసాడు అని రొటీన్ గా సాగుతుంది. దృశ్యం 2 సినిమాలు ఒకసారి చూసి పార్ట్ 3 కి వెళ్తే బెటర్. ఆ సినిమాల్లోని చాలా పాత్రలు ఇందులో వస్తాయి. అధికారికంగా ప్రకటించకపోయినా దృశ్యం 4కి లీడ్ ఇవ్వడం గమనార్హం. చివర్లో అంజు విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్లారిటీ ఇవ్వకుండా, సినిమాకు సరైన ముగింపు ఇవ్వకుండా కన్ఫ్యూజన్ ఇవ్వడం, చివర్లో వరుణ్ తల్లి సీన్ తో కచ్చితంగా పార్ట్ 4 ఉండే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
మోహన్ లాల్ ఎప్పట్లాగే తన బెస్ట్ ఇచ్చారు. మీనా కూడా తన పాత్రలో బాగానే నటించారు. అంజు పాత్రలో అన్పిబ హస్సన్ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో మేపిస్తుంది. ఎస్తర్ అనిల్ పాత్ర ఫ్యామిలీ కంటిన్యూ ఉండాలి కాబట్టి పక్కన అలా ఉంది ఆమె పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ అక్కడక్కడా నవ్వించింది ఎస్తర్. షాజాన్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. సిద్ధికి, మురళి గోపి, వీణ, సురేష్ బాబు.. మిగిలిన మలయాళ నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తక్కువ లొకేషన్స్ లోనే అందంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేయొచ్చు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ తన మార్క్ సాగదీసిన కథాంశం, చివర్లో ట్విస్ట్ లతో ఉత్కంఠ రేకెత్తించేలాగే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా దృశ్యం 3 సినిమా మొదటి రెండు పార్టులని మించి ఆశించకుండా వెళ్లి చూస్తే ఓకే. వాటికి మించి ఎక్కువ ఊహించి వెళ్తే కష్టం. దృశ్యం ఫ్యాన్స్ ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అబిప్రాయం మాత్రమే.
