Papam Prathap Review: ‘పాపం ప్రతాప్’ మూవీ రివ్యూ.. పాపం అంటూనే నవ్వుకోవచ్చు..
Papam Prathap Review and Rating: పాపం ప్రతాప్ అని టైటిల్ పెట్టి హీరోకి ఏదో ఒక సమస్య ఉంది అనే విషయాన్ని నేరుగా ఆడియెన్స్‌కి చెప్పేసాడు దర్శకుడు.(Papam Prathap)
Thiruveer Papam Prathap Movie Review and Rating
Papam Prathap Review: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘పాపం ప్రతాప్’. ఈటీవీ విన్, క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మది రెడ్డి నిర్మాణంలో ఎస్.పి. దుర్గా నరేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పాపం ప్రతాప్ సినిమా నేడు ఏప్రిల్ 17న థియేటర్స్ లో రిలీజయింది. అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, గోపరాజు రమణ, రఘుబాబు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే..
ఈ కథ అంతా 1990 బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. ప్రతాప్ (తిరువీర్), బుజ్జమ్మ (పాయల్ రాధకృష్ణ) స్కూల్ ఏజ్ నుంచి ప్రేమించుకుంటారు. పెద్దయ్యాక ప్రతాప్, బుజ్జమ్మ పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ పెళ్లి ప్రతాప్ తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్)కి ఇష్టం ఉండదు. తల్లి, కొడుకుల ఇష్టంతో జరిగిన పెళ్లి అంటూ వీరయ్య పదే పదే దెప్పిపొడుస్తుంటాడు. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావ్.. నా పరువు పోయే పని చేస్తే చంపేస్తా అని ప్రతాప్‌ని వీరయ్య హెచ్చరిస్తాడు.
మూడు రాత్రులు గడిచిన తరువాత ప్రతాప్ మీద బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ఊరి పెద్దలు, ప్రజల సమక్షంలో ప్రతాప్ సమస్య ఏంటో చెప్పకుండా బుజ్జమ్మ అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్తుంది. అసలు ప్రతాప్ సమస్య ఏంటి? బుజ్జమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? అసలు సమస్యే ఏంటో ప్రతాప్ కి అయినా తెలుసా?భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారా.. లేదా? ప్రతాప్ తండ్రి ఏం చేసాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూ.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ..
పాపం ప్రతాప్ అని టైటిల్ పెట్టి హీరోకి ఏదో ఒక సమస్య ఉంది అనే విషయాన్ని నేరుగా ఆడియెన్స్‌కి చెప్పేసాడు దర్శకుడు. అయితే టీజర్, ట్రైలర్లో సమస్య గురించి చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రతాప్ సమస్య చుట్టూనే తిరుగుతుంది. ప్రతాప్ గురించి ఊర్లో మాట్లాడుకునే మాటలు, వీరయ్య గోపరాజు రమణ కామెడీ సీన్స్, ఊర్లో పనీ పాట లేని ఆకతాయిలా ప్రసాద్ బెహర పాత్రలు నవ్విస్తాయి. ఇంటర్వెల్‌కి కథ చాలా వరకు ఎమోషనల్‌గా మారుతుంది. ఆ తరువాత హీరో తన సమస్యను పోగొట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.
ప్రతాప్, శ్యామ్ మధ్య వచ్చే సీన్స్, ఆ ట్రాక్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కొన్ని చోట్ల కామెడీ కాస్త హద్దులు దాటినట్టుగా అనిపించినా ఆడియెన్స్ మాత్రం ఎంటర్టైన్ అవుతారు. హీరోకు ఉన్న సమస్య ఏంటి చెప్పకుండా ఇంట్రెస్టింగ్గా ముందుకు తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఆ సమస్య ఏంటో తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు చాలా వరకు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్ టచ్‌తో ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ సింపుల్ గా ముగించేశారు అనిపిస్తుంది. ఎక్కువ కామెడీ మీదే ఆధారపడ్డా సెకండ్ హాఫ్ లో మరింత ఎమోషనల్ గా చూపించే ఆస్కారం ఉన్నా సింపుల్ గానే ముగించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
తిరువీర్ ఎప్పట్లాగే తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. అమాయకుడిగా, చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వాడిలా నటించి మెప్పిస్తాడు. పాయల్ రాధకృష్ణ తన పాత్రకు తగ్గట్టుగా ఎమోషనల్‌గా మెప్పిస్తుంది. సీనియర్ నటి రాశీ అమ్మ పాత్రలో ఆకట్టుకుంటుంది. అజయ్ ఘోష్ తండ్రిగా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. గోపరాజు రమణ, ప్రసాద్ బెహర, రవి ఆంటోని పాత్రలు నవ్విస్తాయి. రఘు బాబు పాత్ర కూడా అక్కడక్కడా నవ్విస్తుంది. అవసరాల శ్రీనివాస్ కారెక్టర్ సెకండాఫ్‌లో కనిపించి పర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : హాంకాంగ్‌లో రాయల్ లుక్‌లో రామ్ చరణ్.. ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్ ఫోటోలు వైరల్
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓ కొత్త సమస్యతో భార్యాభర్తల మధ్య కథగా రాసుకొని నవ్వించడంలో, ఎంటర్టైన్ చేయడంలో పాపం ప్రతాప్ సక్సెస్ అయినా భావోద్వేగాలు ఇంకాస్త పండించాల్సింది. కొన్ని డైలాగ్స్ మాత్రం ఎమోషనల్ గా మెప్పిస్తాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘పాపం ప్రతాప్’ ఓ కొత్త సమస్యతో ప్రేక్షకులని నవ్విస్తూ ఎమోషనల్ చేసే సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
