Star Directors : 2023 సినిమా ఇండస్ట్రీని ఊపేసిన టాప్ 5 డైరెక్టర్స్ వీళ్ళే.. భారీ సినిమాలతో..

2023లో మాత్రం డైరెక్టర్ల మధ్య పోటీ నడిచింది. హీరోల డామినేషన్ కంటే ఎక్కువగా డైరెక్టర్ల డామినేషన్ కనిపించింది.

Star Directors : 2023 సినిమా ఇండస్ట్రీని ఊపేసిన టాప్ 5 డైరెక్టర్స్ వీళ్ళే.. భారీ సినిమాలతో..

2023 Biggest Hit South Star Directors List Full Details

Star Directors : ఎప్పుడైనా.. ఎక్కడైనా.. హీరోల మధ్య పోటీ కామన్. హీరోల ఫ్యాన్స్ మధ్య పోటీ కామన్. కానీ 2023లో మాత్రం డైరెక్టర్ల మధ్య పోటీ నడిచింది. హీరోల డామినేషన్ కంటే ఎక్కువగా డైరెక్టర్ల డామినేషన్ కనిపించింది. కేవలం హీరోల్నే కాదు ఈసారి డైరెక్టర్ ని చూసి సినిమాలకు వెళ్లారు చాలామంది ఆడియన్స్. 2023లో డైనమెట్ లాంటి మూవీస్ తో బాక్సాఫీస్ ని దద్దరిల్లేలా చేశారు ఆ డైరెక్టర్స్.

నాలుగు సినిమాలు.. రెండు వేల కోట్ల వసూళ్లు.. ఇది డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) రికార్డ్. కేజీఎఫ్ మూవీతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేసిన ప్రశాంత్ నీల్.. 2023లో సలార్ తో తన స్టామినా ఏంటో మరోసారి ఫ్రూవ్ చేశాడు. ప్రభాస్ ని డైనోసార్ రేంజ్ లో చూపించి దడ పుట్టించాడు. బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. 2023 హైయ్యెస్ట్ ఓపెనర్ నిలిచింది సలార్. రాజమౌళి తర్వాత నార్త్ లో మళ్లీ ఆ రేంజ్ లో సత్తా చాటిన సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రమే. అందుకే స్టార్సంతా ఇఫ్పుడు ప్రశాంత్ నీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి 2023.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి బాగా కలిసొచ్చింది. అందుకే డిసెంబర్ లో సలార్ రిలీజ్ చేసి గ్రాండ్ గా 2023కి సెండ్ ఆఫ్ ఇచ్చారు.

ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఎప్పుడొచ్చినా సెన్సేషనే.. 2023లో యానిమల్ మూవీతో సందీప్ వంగా మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడు. హీరో రణబీర్ కపూర్ కి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్‌తో వచ్చిన యానిమల్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అదరగొడుతుంది. యానిమల్ హిట్ తో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ప్రభాస్, అల్లుఅర్జున్, రణబీర్ లతో భారీ సినిమాలను లైన్ లో పెట్టాడు సందీప్ వంగా.

Also Read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ముగ్గురు హీరోల స్టెప్పులు చూశారా?

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ.. ఓ ట్రెండ్ సెట్ చేసిన కోలివుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) కి.. 2023 మాంచి కిక్కిచ్చింది. విజయ్ తో చేసిన బీస్ట్ మిశ్రమ స్పందన రావడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్నాడు. మరో పక్క ఎప్పట్నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ కి ‘జైలర్’ మూవీతో అదిరిపోయే హిట్టిచ్చాడు నెల్సన్. పర్ఫెక్ట్ స్ర్కీన్ ప్లే, పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ తో బొమ్మ అదుర్స్ అనిపించాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో అరిపించేశాడు. చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ అభిమానులకి.. 2023లో పండగ తీసుకొచ్చాడు డైరెక్టర్ నెల్సన్.

మొన్నటిదాకా నార్త్ లో సత్తాచాటిన సౌత్ డైరెక్టర్సంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ వంగా పేర్లే ఎక్కువగా వినిపించేవి. కానీ 2023లో కోలివుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) లైన్లోకొచ్చాడు. భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్ ఖాన్ కి.. జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చి కరువు తీర్చాడు. వెయ్యి కోట్ల వసూళ్లతో జవాన్ ఈ ఏడాది హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. తమిళ్ డైరెక్టర్ అట్లీకి 2023 కలిసొచ్చి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.

Also Read : Salaar Vs Jailer : రజినీకాంత్ ‘జైలర్’ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్ ‘సలార్’.. ఎక్కడో తెలుసా?

అంచనాలకి అందకుండా సినిమాలు తీసే మరో కోలివుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). మొదటి సినిమా నుంచి వరుస హిట్స్ కొడుతూ ప్రేక్షకులని మెప్పిస్తూ వెళ్తున్నాడు. 2022 లో విక్రమ్ మూవీతో కమల్ హాసన్ ని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చాడు. 2023లో కూడా లోకేష్ తన మార్క్ చూపించాడు. దళపతి విజయ్ తో లియో చేశాడు. 620 కోట్లకిపైగా కలెక్షన్స్ తో లియో విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. 2023లో చాలామంది స్టార్ డైరెక్టర్స్ సైడైపోయినా ఇలా వచ్చినవాళ్లు మాత్రం గట్టిగా అదరగొట్టి బాక్సాఫీస్ ని షేక్ చేశారు.