‘A1 ఎక్స్ప్రెస్’ – బయలు దేరింది..
హాకీ బ్యాక్డ్రాప్లో తెలుగులో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా ‘A1 ఎక్స్ప్రెస్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..
- sekhar
- Published on- November 4, 2019 / 07:41 AM IST
హాకీ బ్యాక్డ్రాప్లో తెలుగులో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా ‘A1 ఎక్స్ప్రెస్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘A1 ఎక్స్ప్రెస్’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం (నవంబర్ 4)న ప్రారంభమైంది.. హాకీ బ్యాక్డ్రాప్లో తెలుగులో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే ఈ జోనర్లో సందీప్ కిషన్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీశర్మ, రఘుబాబు, సందీప్ కిషన్లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Read Also : రచయితలు లేనిదే మేములేము : మెగాస్టార్ చిరంజీవి
‘నినువీడని నీడనునేనే’ సినిమాతో హిట్ అందుకున్న సందీప్ నటించిన ‘తెనాలి రామకృష్ణ BA.BL’. నవంబర్లో విడుదల కానుంది. సంగీతం : హిప్ హాప్ తమిళ, కెమెరా : కెవిన్ రాజు, ఎడిటింగ్ : ఛోటా కె.ప్రసాద్.
