Prithiveeraj : తన కొడుకు కంటే చిన్న అమ్మాయితో పృథ్వి రాజ్ లవ్ స్టోరీ.. బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్ళలేదంటే?

పెళ్లి సినిమా విలన్ పృథ్వి రాజ్ గుర్తున్నారా? తనకంటే 33 ఏళ్ళు చిన్న వయసున్న అమ్మాయితో ప్రేమలో పడ్డారట. అయన చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదవండి.

Prithiveeraj : తన కొడుకు కంటే చిన్న అమ్మాయితో   పృథ్వి రాజ్ లవ్ స్టోరీ.. బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్ళలేదంటే?

Babloo Prithiveeraj

నటుడు పృథ్వి రాజ్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించారు. అందరూ బబ్లూ పృథ్వి రాజ్ అంటారు. 1974 లో వచ్చిన ‘అమ్మ మనసు’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పెళ్లి’ మూవీతో పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో విలన్ పాత్రకు నంది అవార్డు అందుకున్నారు. తర్వాత పెళ్ళాడి చూపిస్తా , ప్రేయసి రావే, దీర్ఘ సుమంగళీ భవ, నా మనసిస్తా రా, నువ్వు నాకు నచ్చావ్,  ఎన్టీఆర్: మహా నాయకుడు వంటి సినిమాల్లో నటించారు.

Theatrical Movies : ఈ వారం తెలుగులో రిలీజయ్యే సినిమాలు ఇవే.. ఆఖరి వారం గట్టి పోటీనే ఉందిగా..

నటుడిగా మంచి గుర్తింపు ఉన్న పృథ్వి రాజ్ ప్రేక్షకులకి తాజాగా బిగ్ షాక్ ఇచ్చారు. 57 ఏళ్ళ పృథ్వి రాజ్ తనకంటే 33 ఏళ్ళు చిన్న వయసున్న శీతల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. పృథ్వి రాజ్‌కు బీనా అనే ఆమెతో గతంలో పెళ్లి అయ్యింది. వీరికి ఆహద్ అనే 27 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. బీనాతో విడిపోయిన పృథ్వి రాజ్.. శీతల్ ప్రేమలో పడ్డారు. వీరి మధ్య వయసు తేడా కారణంగా ట్రోల్‌కి గురయ్యారు.

తాజాగా పృథ్వి రాజ్ మీడియాతో తన ప్రేమ గురించి కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తమ జంట గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చాలా బాధ పెట్టాయని ప్రస్తుతం వాటిని పట్టించుకోవడం మానేశామని పృథ్వి రాజ్ చెప్పారు. శీతల్ చాలా మెచ్యురిటీ ఉన్న అమ్మాయి అని తను ఎంతో  ధైర్యం చెప్పిందని అన్నారు.  ఇద్దరూ  ప్రస్తుతం హ్యాపీగా ఉన్నామని పృథ్వి రాజ్ తెలిపారు.

MS Dhoni: ముంబయిలో మహేంద్ర సింగ్ ధోనీతో రామ్ చరణ్.. మరోసారి ఇరువురి ఫ్యాన్స్ కు పండుగేనా?

శీతల్‌కి పృథ్వి రాజ్ ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశారట. వెంటనే ఆమె అంగీకరించిందట . ప్రేమకు వయసు నెంబర్ కాదని పృథ్వి రాజ్ అన్నారు. ఇక ఇండస్ట్రీ సంగతులు చెబుతూ బిగ్ బాస్ షోకి వెళ్లడం తనకి చాలా ఇంట్రస్ట్ అని , ఎప్పుడు వాళ్ళు పిలిచినా అదే టైంలో తను మూవీస్‌లో బిజీగా ఉన్నాను అని చెప్పారు పృథ్వి రాజ్. తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ ఇండస్ట్రీ అని.. ఇతర భాషల్లో చాలామంది వర్క్ చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టారని పృథ్వి రాజ్ చెప్పుకొచ్చారు. సీరియల్స్, మూవీస్, వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్న పృథ్వి రాజ్ శీతల్‌తో పెళ్లి ఎప్పుడో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

Kannappa Movie : కన్నప్పలో మలయాళం స్టార్ హీరో.. విష్ణు ఇంకెంతమందిని తీసుకొస్తాడో??