Rajasekhar : పిల్లలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. కానీ అందుకే ఆగాం: రాజశేఖర్
Actor Rajasekhar : బైకర్ మూవీ హిట్టుతో ఫుల్ జోష్ లో ఉన్న యాంగ్రీమ్యాన్ రాజశేఖర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Updated on- April 14, 2026 / 08:15 PM IST
actor rajasekhar about his daughter shivani and shivathmika career and marriage
Rajasekhar : మా అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. కానీ వాళ్లు మాత్రం మరికొన్నాళ్లు నటిస్తామంటున్నారు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడం లేదు” అని యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ తెలిపారు. తాజాగా ఆయన హీరో శర్వానంద్ ‘బైకర్’ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం.. భారతీయ సినీ చరిత్రలోనే తొలి కంప్లీట్ ‘మోటో క్రాస్ డ్రామా’గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషన్స్ లో పాల్గొన్న రాజశేఖర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల గురించి:
రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తాము రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు సొంత డబ్బులే ఖర్చు చేశామని రాజశేఖర్ తెలిపారు. ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. నిజానికి జీవితకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదని వెల్లడించారు. ఇక తమిళ హీరో, టీవీకే (TVK) అధినేత విజయ్ పొలిటికల్ కెరీర్ గురించి స్పందిస్తూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుస్తారని భావిస్తున్నానని, ఆయన రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
కుమార్తెల పెళ్లి గురించి:
తన కుమార్తెలు శివాని, శివాత్మికల కెరీర్ మరియు పెళ్లి గురించి మాట్లాడుతూ.. “పిల్లలకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉంది. సంబంధాలు కూడా వస్తున్నాయి. కానీ వాళ్లు మాత్రం మరికొన్నాళ్లు యాక్టింగ్ చేస్తామని చెబుతున్నారు. వారి ఇష్టానికే ప్రాధాన్యతనిస్తూ ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలు ఆపాము” అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ బైకర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన శర్వాకు తండ్రిగా యాక్ట్ చేశారు. మాళవిక్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
