Bigg Boss 8 Promo : హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన సీత.. నేనే గిన్నెలు తోమాల్నా..?

ఇన్ని రోజులు నాగ మణికంఠ ఎమోషనల్ అవ్వగా ఇప్పుడు సీత ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది.

Bigg Boss 8 Promo : హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన సీత.. నేనే గిన్నెలు తోమాల్నా..?

Actor Seetha Crying in Bigg Boss House Latest Promo goes Viral

Bigg Boss 8 Promo : బిగ్ బాస్ లో నామినేషన్స్ అయిన తర్వాత మూడు టీమ్ లుగా విడిపోయి టాస్కులు అడవుతున్నారు. దీంతో అప్పుడే కంటెస్టెంట్స్ టీమ్స్ గా విడిపోయారు. ఒకరితో ఒకరు అన్నిట్లో గొడవ పడుతున్నారు. ఎక్కువగా కిచెన్, ఫుడ్ విషయంలోనే అందరికి గొడవలు వస్తున్నాయి.

తాజాగా నేడు టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రెండు టీమ్స్ కి ఒక టాస్క్ ఇస్తే వాళ్ళు ఆ టాస్క్ ఆడకుండా పక్కనున్న వాళ్ళ టాస్క్ ని చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక కిచెన్ దగ్గర సీత.. మీ గిన్నెలు మీరు కడుక్కోండి అని చెప్పడంతో అభయ్.. అది గేమ్ అని అన్నాడు. దీంతో సీత రెచ్చిపోయి మీరు పనిచెయ్యరా.. మీ గిన్నెలు మేమెందుకు కడగాలి అంటూ ఫైర్ అవ్వడంతో అభయ్ కూడా ఫైర్ అయ్యాడు.

Also Read : Mokshagnya Full Name : బాలయ్య తనయుడు ‘మోక్షజ్ఞ’ పూర్తిపేరు ఏంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా..

దీంతో సీత నాకు అన్నం వద్దు అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి పడుకుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా వాళ్ళ గిన్నెలు తోముకుంటూ ఉంటే మనం ఎప్పుడు గేమ్ ఆడతాము అంటూ ఎమోషనల్ అయింది. ఇన్ని రోజులు నాగ మణికంఠ ఎమోషనల్ అవ్వగా ఇప్పుడు సీత ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ప్రోమో చూసేయండి..