Srikanth Iyengar: గాంధీ మహాత్ముడు ఎలా అయ్యాడు.. అతను ఒక.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు

నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన కామెంట్స్ చేశాడు. మహాత్మ గాంధీ(Srikanth Iyengar) గురించి ఆయన మాట్లాడుతూ అయన జాతిపిత ఎలా అయ్యాడు అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఈమేరకు ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Srikanth Iyengar: గాంధీ మహాత్ముడు ఎలా అయ్యాడు.. అతను ఒక.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు

Actor Srikanth Iyengar made inappropriate comments on Mahatma Gandhi

Updated On : October 7, 2025 / 6:25 PM IST

Srikanth Iyengar: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన కామెంట్స్ చేశాడు. మహాత్మ గాంధీ గురించి ఆయన మాట్లాడుతూ అయన జాతిపిత ఎలా అయ్యాడు అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఈమేరకు ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు(Srikanth Iyengar). ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో, గాంధీ అభిమానులు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై మండిపడుతున్నారు.

Predator: Badlands: ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అండ్ విజువల్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇక వీడియోలో శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ “అక్టోబర్ 2న ఒక నటుడు గాంధీని ఎదో అన్నాడని అతన్ని ట్రోల్ చేశారు. ఎం తెలుసు మీకు గాంధీ గురించి. ఆయన మ‌హాత్ముడు కాదు. స్త్రీలోలుడు. ఏంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు. మేము భరతమాత అంటాం. అలాంటిది గాంధీ జాతిపిత ఎలా అయ్యాడు” అంటూ తీవ్రంగా స్పందించాడు. దాంతో, ఆయనపై గాంధీ మద్దతుదారులు మండిపడుతున్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం ఇలాంటి కామెంట్స్ చేశాడు. కానీ, వెంటనే తన తప్పును తెలుసుకొని ఆ వీడియోను డిలీట్ చేశాడు.