Malvi Malhotra : రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. రాజ్ తరుణ్ లవర్ పై మాల్వి మళ్ళీ ఫిర్యాదు..
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లవర్ లావణ్య పై ఫిర్యాదు చేసింది.
![Malvi Malhotra : రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. రాజ్ తరుణ్ లవర్ పై మాల్వి మళ్ళీ ఫిర్యాదు.. Malvi Malhotra : రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. రాజ్ తరుణ్ లవర్ పై మాల్వి మళ్ళీ ఫిర్యాదు..](https://10tv.in/wp-content/uploads/2024/07/raj-tharun-1.jpg)
Actress Malvi Malhotra Complaint on Raj Tharun Lavanya in Film Nagar Police Station
Malvi Malhotra : ఇటీవల హీరో రాజ్ తరుణ్ పై తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని లావణ్య అనే యువతి కేసు పెట్టి మరో హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు అంటూ రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. వీటిపై రాజ్ తరుణ్ కూడా స్పందిస్తూ అవన్నీ అబద్దాలు, ఆమె డ్రగ్స్ వాడుతుంది, వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండేది అని తెలిపాడు. అయితే ఈ ఇష్యూలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు బాగా వైరల్ అయింది. దీంతో కొన్ని రోజుల క్రితమే మాల్వి మల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది.
ఇటీవల లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారని, మాల్వి హిమాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ ఫ్యామిలీకి చెందింది అని, తనని చంపేస్తామని బెదిరించారని ఆరోపణలు చేసింది. దీంతో తాజాగా లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Anasuya – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. చిన్న పాత్ర చేశాను అంటూ..
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లవర్ లావణ్య పై ఫిర్యాదు చేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని, లావణ్య చేసినవన్నీ అబద్దపు ఆరోపణలు అని, తనే నా సోదరుడికి అనుచిత సందేశాలను పంపుతోంది అంటూ ఫిర్యాదు చేసింది. మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేసుపై లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్, మాల్వీ పై ఫిర్యాదు చేసిన లావణ్య మరోసారి కొన్ని ఆధారాలు, స్క్రీన్ షాట్స్ తో ఫిర్యాదు చేసింది. ఇక మాల్వి మల్హోత్రా – రాజ్ తరుణ్ కలిసి తిరగబడరా సామి సినిమాలో నటించారు. ఈ సినిమా జులై 19 రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఈ ఘటనతో వాయిదా పడేలా ఉంది.