2105 మిస్ ఇండియా బికిని విన్నర్ నికితా గోఖలే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
సృష్టిలో బోర్ కొట్టనివి ఊపిరి తీసుకోవడం, అందాల ఆరబోతని ఆస్వాదించడం అంటున్నారు కొంటె కుర్రాళ్లు.. వీళ్లిలా పైత్యం ప్రదర్శించడానికి.. సారీ, కవితలు కట్టడానికి కారణం.. 2015 మిస్ ఇండియా బికిని విన్నర్.. బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్.. లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్.. Nikita Gokhale.. అలియాస్ Nikita Gordijn.. గూగుల్ ట్రాన్సలేటర్‌లో Gordijn అని సెర్చ్ చేస్తే డచ్ భాషలో పరదా అని చూపిస్తోందట.. దీంతో ‘నికితా పాప నిలువెల్లా పరుచుకుంది పరువాల పరదా’ అంటూ మరో కొత్త కవిత కట్టారు కుర్రాళ్లు.
వివరాళ్లోకి వెళ్తే.. మహారాష్ట్ర భండారా జిల్లాలోని తుంసార్‌లో 1990 మార్చ్ 4న పుట్టింది నికితా.. Commerce, CA వంటి చదువుల తర్వాత స్టాక్ మార్కెట్ రంగంలో కొద్ది రోజులు ఉద్యోగం చేసిన తర్వాత లైఫ్ ఇంతేనా.. కొడితే ఏనుగు కుంబస్థలాన్నే కొట్టాలి.. తక్కువ టైమ్‌లోనే సక్సెస్ అవ్వాలని ఫిక్స్ అయ్యి.. మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తత్వానికి తగ్గట్టే తక్కువ సమయంలోనే మెలకువలు నేర్చుకుంది. 2104లో మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తే 2105లో మిస్ ఇండియా బికిని విన్నర్‌గా నిలిచింది.. ఈ లెక్కన ఎంత కష్టపడుంటదో అర్థం చేసుకోండి మరి.. అంతేకాదండోయ్.. 2015 మిస్ వరల్డ్ బికిని మోడల్ ఇండియా.. 2016లో మిస్ గ్లామర్ ఫేస్ ఇండియా.. మిస్ గ్లామర్ ఫేస్ వరల్డ్.. మిస్ యూరోపియన్ టూరిజం ఇండియా.. 2017కి గానూ మిస్ వరల్డ్ స్విమ్‌సూట్ మోడల్ ఇండియా.. మిస్ వరల్డ్ స్విమ్‌సూట్ మోడల్ 2017 ఫైనలిస్ట్‌గా నిలిచింది.
అసలేమాత్రం మొహమాట పడకుండా ఉన్నదున్నట్టు చూపించడంతో (అందాలు ఆరబోయడంతో.. అంటే అదీ ఓ కళే కదా) బాగా పాపులర్ అయింది. కుర్రకారుని పిచ్చోళ్లని చేసింది 2015లో ‘కాలేజ్’ అనే మరాఠి సినిమాలో నటించింది నికితా.. ఆమె తెరమీద కనపించిన మూవీ ఇదొక్కటే.. 2019లో పాపులర్ డచ్ ఫోటోగ్రాఫర్ Jeroen Gordijnని పెళ్లాడింది నికితా.. దీంతో ఆమె అభిమానులు ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు రా బాబు అన్నంతగా బాధపడిపోయారు. పెళ్లైతే అయింది ఎప్పటిలానే తన హాట్ హాట్ ఫోటోలతో అలరిస్తుంది కదా.. కళకి కళ్లతో తప్ప కలర్‌తో పనేముందిలే అంటూ.. ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నికితా ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు రేపుతూ సెన్సేషన్ అయింది..