×
Ad

Pragathi Dance : వయసుతో పనిలేదు.. ఊపొస్తే ఊపాల్సిందే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తీన్‌మార్ డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..

  • Published On : October 28, 2021 / 01:44 PM IST

Pragathi Mahavadi

Pragathi Dance: నటి ప్రగతి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది.. షూటింగ్ అప్‌‌డేట్స్, జిమ్ ఫొటోలు, వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి.. ఒక్కసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే.. ఎవరైనా ఈ విషయం ఒప్పుకుని తీరుతారు..

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అన్నట్లు 44 ఏళ్ల వయసులోనూ అమ్మాయిలకు గట్టిపోటి ఇస్తున్నట్లుంటుంది ఆమె ఫిజిక్. ఇప్పటిరకు ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే.

Suriya : బాల బ్రదర్‌తో సినిమా చేస్తున్నా

కొత్తగా ప్రగతి వేసిన తీన్‌మార్ డ్యాన్స్ వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ‘ఇలాంటి అవకాశం అనేది ఒకటి వచ్చినప్పుడు అస్సలు మిస్ కావొద్దు.. మీ పిచ్చిని బయట పెట్టాలంతే’ అంటూ ప్రగతి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.