Adire Abhi : టైటిల్ మార్చాము.. సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా.. జబర్దస్త్ అదిరే అభి కామెంట్స్ వైరల్..
ఈ ఈవెంట్ లో అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Adire Abhi)
Adire Abhi
Adire Abhi : నటుడు అభినయ కృష్ణ జబర్దస్త్ ప్రోగ్రాంతో అదిరే అభిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు అభి. ఓ పక్క సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే మరో పక్క సినిమాలు చేసేవాడు. జబర్దస్త్ తో మంచి ఫేమ్ వచ్చాక సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసాడు. ఆ తర్వాత దర్శకుడిగా కూడా మారాడు. ఇటీవల అదిరే అభి దర్శకుడిగా చిరంజీవ అనే సినిమాతో రాగా ఇప్పుడు కర్మాఖ్య అనే సినిమాతో రాబోతున్నాడు.
ఇన్నాళ్లు కామాఖ్య అనే టైటిల్ తో ప్రచారం చేసి ఇప్పుడు కర్మాఖ్య అనే టైటిల్ మార్చారు. అదిరే అభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 31న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Varanasi : ‘వారణాసి’ టైటిల్ నాదే.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేసాను..
అదిరే అభి మాట్లాడుతూ.. ట్రైలర్ మీ అంచనాలకు తగ్గట్టు ఉంది అనుకుంటున్నాను. ముందు కామాఖ్య అనే టైటిల్ అనుకున్నాము. ఆ టైటిల్ తోనే ప్రమోషన్స్ కూడా చేసాము. కానీ అనివార్య కారణాల వల్ల టైటిల్ మార్చాల్సి వచ్చింది. దాంతో ప్రమోషన్స్ మళ్ళీ మొదటికి వచ్చింది అనిపించింది. ఇప్పుడు మేము కర్మాఖ్య అనే టైటిల్ తో వస్తున్నాము. కర్మాఖ్య అంటే మనం చేస్తున్న కర్మలే మన గుర్తింపు అని. ఈ సినిమా అమ్మవారి ఎలిమెంట్ ఉన్న ఒక క్రైం థ్రిల్లర్. మీరు ఈ సినిమాని థియేటర్లో చూస్తే ఖచ్చితంగా థ్రిల్ కి గురవుతారు అని గుండెమీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్తాను.
ఒకవేళ సినిమా బాగోలేదు అనే టాక్ వస్తే నేను గుండు కొట్టించుకుంటాను. ఇది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పట్లేదు. నా కష్టం, నా సబ్జెక్టు మీద ఉన్న నమ్మకం. అంతేకాక ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు నేను ఇచ్చుకునే పనిషమెంట్. నిజంగా ఇది బాగోలేదు అనే టాక్ వస్తే నేను గుండు కొట్టించుకుంటాను. ఈ సినిమా హిట్ అయితే సినిమాలో పనిచేసినవాళ్లందరికి క్రెడిట్ ఇస్తాను. ఒకవేళ సినిమా పోతే ఆ క్రెడిట్ మొత్తం నాదే అని అన్నారు.
దీంతో అభి కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇటీవల పలువురు హీరోలు, దర్శకులు తమ సినిమాల మీద ఇలాగే ఛాలెంజ్ లు చేస్తున్నారు. ఇప్పుడు అభి కూడా చేయడంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి నెలకొంది.
