AHA 2.0: ఇది ఆరంభం మాత్రమే.. ఐకాన్ స్టార్ సమక్షంలో ఆహా సెలబ్రేషన్స్
కొద్ది రోజుల ముందే లాంచ్ అయినట్లుగా అనిపిస్తున్న ఆహా రికార్డులు తెలుసా.. 50 మిలియన్ యూజర్లను సంపాదించుకుంది. 13మిలియన్ కు పైగా ఫోన్లలో ఇన్ స్టాల్ అయి ఉంది.
- Subhan Ali Shaik
- Published On : October 30, 2021 / 09:27 PM IST
Aha Launching
AHA 2.0: కొద్ది రోజుల ముందే లాంచ్ అయినట్లుగా అనిపిస్తున్న ఆహా రికార్డులు తెలుసా.. 50 మిలియన్ యూజర్లను సంపాదించుకుంది. 13మిలియన్ కు పైగా ఫోన్లలో ఇన్ స్టాల్ అయి ఉంది. ఇదంతా సాధించింది కేవలం 20నెలల్లోనే. ఇప్పుడు మరో అవతార్ తో మనముందుకు వచ్చేందుకు రెడీ అయింది.
అదే ఆహా 2.0. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో లాంచ్ అవుతున్న ఈ ప్లాట్ ఫాం మరింత ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు.. అభిమానులను అలరించేందుకు సరికొత్త ఐడియాతో రాబోతుంది. దీనికి ఆహా టీం గ్రాండ్ సెలబ్రేషన్ తో వెల్ కమ్ చెబుతుంది.
అనూహ్యంగా మైలురాయిని చేరుకున్న సెలబ్రేషన్స్ తో పాటు AHA 2.0ను కూడా లాంచ్ చేస్తున్నారు. 2021 నవంబర్ 2న సాయంత్రం 5గంటలకు నోవాటెల్ వేదికగా కార్యక్రమం జరగనుంది.
……………………………………….: చలిలో కూడా చెమటలు పట్టించే సన్నీ!
