అజిత్ ‘విశ్వాసం’కి అరుదైన ఘ‌న‌త‌: 4వ స్థానంలో మహర్షి

  • Publish Date - November 13, 2019 / 04:44 AM IST

తమిళ్ తలైవా అజిత్ నటించిన విశ్వాసం,టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలు ట్విట్టర్ లో 2019లో టాప్ ఇన్ఫ్లుయెన్షల్(ప్రభావిత)మామెంట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల గురించి అభిమానులు తమ పోస్ట్‌లో ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్ ట్రెండింగ్ గా మారాయి. మంగళవారం(నవంబర్-12,2019) లాంచ్ 2020 ఈవెంట్ లో…టాప్ 5- 2019  ప్రభావిత విషయాల లిస్ట్ ను ట్విట్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఈ ఏడాది జనవరిలో విడుదలైన అజిత్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన  ‘విశ్వాసం’ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి 4వ స్థానంలో ఉంది. 

అజిత్, పాపులర్ డైరెక్ట‌ర్ శివ కాంబినేషన్ లో రూపొందించిన విశ్వాసం సినిమా తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అజిత్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము దులిపాడు. అంతేకాదు ఎమోషనల్ సీన్లలో అజిత్ నటన పీక్స్ లో ఉంటుంది. అజిత్ మాస్, యాక్షన్ సీన్లు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి.

ట్విట్టర్ 2019 టాప్ 5- 2019 లిస్ట్ :

1. #విశ్వాసం. 
2. # లోక్ సభ ఎన్నికలు 2019.
3. #CWC19. 
4. #మహర్షి.
5. #హ్యాపి దీవాళి.