Vaishnavi Kokkura : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా అంటూ..

పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వైష్ణవి కొక్కుర ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. (Vaishnavi Kokkura)

Vaishnavi Kokkura : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా అంటూ..

Vaishnavi Kokkura

Updated On : December 18, 2025 / 7:15 AM IST

Vaishnavi Kokkura : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలు, హీరోయిన్స్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లోకి మరో నటి జత చేరింది. పలు యాడ్స్, సీరియల్స్, భీమ్లా నాయక్ తో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వైష్ణవి కొక్కుర ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ఓ ప్రైవేట్ సాంగ్ తో కూడా మెప్పించింది వైష్ణవి.(Vaishnavi Kokkura)

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పురుష:’. పవన్ కళ్యాణ్‌ బత్తుల ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి కొక్కురని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Also See : Shivani Nagaram : ఇన్నాళ్లు పద్దతిగా.. ఇప్పుడు హాట్ హాట్ ఫోజులతో.. లిటిల్ హార్ట్స్ భామ ఫొటోలు..

ఈ పోస్టర్‌ లో భార్యాభర్తల మధ్య గొడవ, ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు అన్నట్టు చూపించి పోస్టర్ పై ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా..’ అనే డైలాగ్ పెట్టారు. దీంతో ఈ సినిమాలో వైష్ణవి బాగా ఏడ్చే పాత్ర అని తెలుస్తుంది. భార్యాభర్తల గొడవలు, మగవాళ్ల సమస్యలు ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో విషిక, హాసిని సుధీర్‌ అనే మరో ఇద్దరు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్.. పలువురు కమెడియన్స్ కూడా ఉన్నారు.

Vaishnavi Kokkura Child Artist Turns as Heroine with Purushaha Movie